
CSK vs RCB Highlights, ఐపీఎల్ 2024: IPL 2024 కోసం నిరీక్షణ ముగిసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో, CSK లీగ్‌లోని మొదటి మ్యాచ్‌లో RCBని 6 వికెట్ల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నైకి 174 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆర్సీబీ తరపున కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 35 పరుగులు చేశాడు. అనుజ్ రావత్ 48 పరుగులు, దినేష్ కార్తీక్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. విరాట్ కోహ్లీ 21 పరుగులు చేశాడు. అంతకుముందు పటీదార్, మ్యాక్స్‌వెల్‌లు జీరోకే ఔటయ్యారు. చెన్నై తరపున ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు.
174 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబే (34), రవీంద్ర జడేజా (25) ఐదో వికెట్‌కు అజేయంగా 66 పరుగులు జోడించారు. 15 పరుగుల వద్ద కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. 37 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. అనంతరం 27 పరుగుల వద్ద అజింక్య రహానే ఔట్ కాగా, 22 పరుగుల వద్ద డారిల్ ఔటయ్యాడు.
CSK జట్టు తొమ్మిదోసారి ఏదైనా IPL సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతుంది. జట్టు ఇంతకు ముందు 8 సార్లు ఇలా తొలి మ్యాచ్ ఆడింది. ఇప్పటి వరకు 10 ఫైనల్స్ ఆడిన చెన్నై జట్టు 5 సార్లు టైటిల్‌ను గెలుచుకుంది. RCB 16 సీజన్లలో మూడు ఫైనల్స్ ఆడింది. అయితే, బెంగళూరు జట్టు ఇప్పటికీ మొదటి టైటిల్ కోసం వేచి చూస్తోంది. చెపాక్‌లో చెన్నైతో జరిగిన 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు విజయం సాధించింది.
చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఉపయోగపడుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని వికెట్ స్పిన్నర్లకు స్వర్గధామంగా పేరుగాంచింది. ఇక్కడ బ్యాట్స్‌మెన్స్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మైదానంలో CSK ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లు ఆడగా, అందులో 45 మ్యాచ్‌లు గెలిచింది. 18 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిని చవిచూసింది. 1 మ్యాచ్ కూడా టై అయింది.
చెపాక్ స్టేడియంలో RCB 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో 8 మ్యాచ్‌లు చెన్నైతోనే తలపడింది. ఇందులో జట్టు 7 ఓడిపోయింది. ఒకదానిలో మాత్రమే గెలిచింది. CSKతో పాటు, బెంగళూరు కూడా చెపాక్‌లో 4 మ్యాచ్‌లు ఆడగా, ఆ జట్టు నాలుగింటిలోనూ విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్.
IPL 2024 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 173 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా సీఎస్‌కే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
సీఎస్‌కే 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే ఉన్నాడు.
15 బంతుల్లో 37 పరుగులు చేసి రచిన్ రవీంద్ర ఔటయ్యాడు.
సీఎస్‌కే 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే ఉన్నారు.
15 పరుగుల వద్ద కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. యశ్ దయాల్ బౌలింగ్‌లో స్లిప్‌లో నిలబడిన కామెరూన్ గ్రీన్ చేతికి చిక్కాడు.
3 ఓవర్లలో సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్రలు ఓపెనింగ్‌కు వచ్చారు.
IPL-2024 ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి 174 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది.
అనూజ్ రావత్ 25 బంతుల్లో 48 పరుగులు, దినేష్ కార్తీక్ 26 బంతుల్లో 38 పరుగులు చేశారు. వీరిద్దరూ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 35 పరుగులు, విరాట్ కోహ్లి 21 పరుగులు, కెమెరూన్ గ్రీన్ 18 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు.
బెంగళూరు జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. క్రీజులో అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ ఉన్నారు. వీరిద్దరి మధ్య యాభై భాగస్వామ్యం నెలకొంది.
బెంగళూరు జట్టు 17 ఓవర్లలో 5 వికెట్లకు 123 పరుగులు చేసింది. క్రీజులో అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ ఉన్నారు.
బెంగళూరు జట్టులో సగం మంది పెవిలియన్ బాట పట్టారు. ముస్తాఫిజుర్ రెహమాన్ 12వ ఓవర్లో రెండు వికెట్లు తీసి బెంగళూరు మిడిలార్డర్ కమాండ్ ను బ్రేక్ చేశాడు. అతను 12వ ఓవర్ నాలుగో బంతికి కమ్రాన్ గ్రీన్ బౌల్డ్ చేశాడు. 22 బంతుల్లో 18 పరుగులు చేసి గ్రీన్ అవుట్ అయ్యాడు.
బంగ్లాదేశ్ బౌలర్ దూకుడుతో బెంగళూరు జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. కేవలం రెండు ఓవర్లు వేసిన ఈ సీఎస్‌కే బౌలర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రస్తుతం బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 13 ఓవర్లలో 83 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 21 పరుగులు చేసి అవుటయ్యాడు. రెహమాన్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర చేతికి చిక్కాడు.
బెంగళూరు జట్టు 9 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కెమరూన్ గ్రీన్ ఉన్నారు. కోహ్లీ 12 వేల టీ-20 పరుగులు పూర్తి చేశాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ సున్నా వద్ద ఔటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఎంఎస్ ధోని చేతికి చిక్కాడు. అంతకుముందు రజత్ పటీదార్ (0), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (35 పరుగులు)లను ముస్తాఫిజుర్ రెహమాన్ పెవిలియన్ పంపాడు.
బెంగళూరు జట్టు 6 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. కోహ్లీ, గ్రీన్ క్రీజులో ఉన్నాడు.
ముస్తాఫిజర్ బౌలింగ్‌లో బెంగళూరు జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. రజత్ పాటిదార్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆర్‌సీబీ జట్టు 41 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
ముస్తాఫిజర్ బౌలింగ్‌లో బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ 35 పరుగులకు పెవిలియన్ చేరాడు.
4 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ఇందులో డుప్లెసిస్ 31, కోహ్లీ 3 పరుగులతో నిలిచారు.
టాస్ గెలిచిన బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసెస్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి బంతిని దీపర్ చాహర్ సంధించాడు. కానీ, అది వైడ్ కావడంతో.. ఐపీఎల్ 2024లో తొలి పరుగు వైడ్ బంతితో వచ్చింది.
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్.
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.
టాస్ గెలిచిన RCB కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్‌తో పాటు ఇరు జట్లలోని ప్లేయింగ్ ఎలెవన్ కూడా బయటకు వచ్చింది.
ప్రారంభ వేడుకలు ముగిశాయి. దీంతో అసలు పోరుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ మరికొద్దిసేపట్లో జరగనుంది. మైదానంలో ధోని, కోహ్లీలు తుది కసరత్తులు చేస్తున్నారు.
ప్రారంభ వేడుకలు ముగిసిన తర్వాత చెన్నై సారథి రుతురాజ్ ఐపీఎల్ ట్రోపీని తీసుకొని, స్టేజ్‌పైకి చేరకున్నాడు.
అక్షయ్ కుమార్ తర్వాత ఏఆర్ రెహ్మాన్ పాటతో చెపాక్ స్టేడియం ఉప్పొంగింది.
AR Rahman and “Maa Tujhe Salaam”🔥🔥🔥 what a great way to start the festival ❤️#IPLonJioCinema #IPLOpeningCeremony #CSKvRCB pic.twitter.com/z4jmgXvWNG
— Jigar Punadiya (@Jigspunadiya) March 22, 2024
ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. బాలీవుడ్ హీరోలు తొలి ప్రదర్శన చేస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ జాతీయ జెండాతో ఎంట్రీ ఇచ్చారు.
What an entry by Akshay Kumar to the IPL opening ceremony. 🔥#RCBvsCSK #IPL2024 #CSKvsRCB #IPLOpeningCeremony #TATAIPL2024 pic.twitter.com/HYg2IIroMa
— Ma (@madrid_ping) March 22, 2024
ప్రారంభోత్సవ వేడుకలు మొదలయ్యాయి. అయితే, ఇరుజట్ల ఆటగాళ్లు కూడా స్టేడియానికి చేరుకున్నారు.
ఇప్పుడు ప్రారంభోత్సవ వేడుకలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొద్ది క్షణాల్లో అక్షయ్ కుమార్, సోనూ నిగమ్ వంటి ఆర్టిస్టులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రారంభ వేడుక తర్వాత, తొలిమ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో CSK వర్సెస్ RCB జట్లు ఒకదానితో ఒకటి తలపడేందుకు సిద్ధమయ్యాయి.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోని కోసం ఫ్యాన్స్ కదలివస్తున్నారు. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ చెన్నైలోనే జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ స్టేడియానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా చెపాక్ స్టేడియం పసుపు సంద్రంగా మారిపోయింది. సీఎస్‌కే ఫ్యాన్స్ తరలిస్తున్నారు.
Team with greatest legacy and biggest fanbase! @ChennaiIPL 👑#MSDhoni | #CSKvsRCB ✨💪🏻 #ChennaiSuperKings #IPLOpeningCeremony
— Ramlal beniwal (@Ramlalbeniwal_) March 22, 2024
ఐపీఎల్ ప్రారంభ వేడుక మరి కొద్దిసేపట్లో మొదలుకానుంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఓపెనింగ్ వేడుకను చూసేందుకు స్టేడియానికి చేరుకుంటున్నారు.
FANS STARTED ENTERING INTO THE STADIUM#IPL2024 #IPLOpeningCeremony #RCBvsCSK #RCB #CSKvsRCB #CSKvsRCB pic.twitter.com/Npjd2NbeJV
— GlobalTrending24 (@GlobalTrendng24) March 22, 2024
ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు చెపాక్ స్టేడియం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.
First time ever,
South people are going to see REAL RAW LIVE Action 🤯 #IPLOpeningCeremonyPower of #AkshayKumar 💥
#BadeMiyanChoteMiyan pic.twitter.com/owRzCaTUqT— M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) March 22, 2024
IPL 2024 సీజన్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నేటి నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్‌లో చెన్నై జట్టు బెంగళూరుతో తలపడుతోంది.
The stage is set, the lights are bright, and the stars are ready to shine at the #TATAIPL 2024 Opening Ceremony! 🎉🥳
Get ready for an unforgettable fusion of cricket and entertainment ft. a stellar lineup! ✨
🗓22nd March
⏰6:30 PM onwards pic.twitter.com/7POPthFITx— IndianPremierLeague (@IPL) March 20, 2024
క్రికెట్ యాక్షన్ ప్రారంభమయ్యే ముందు గ్రాండ్ ఓపెనింగ్ వేడుక ఉంటుంది. ఇందులో AR రెహమాన్, అక్షయ్ కుమార్, సోనూ నిగమ్ వంటి స్టార్లు ప్రదర్శన ఇవ్వనున్నారు.
సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. అయితే, చెన్నెై వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.