
ఐపీఎల్ 2024 ఫీవర్ మొదలైంది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అటు విరాట్ కోహ్లీ.. ఇటు మహేంద్ర సింగ్ ధోని.. ఫైట్ కచ్చితంగా ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మాదిరిగా ఉండటం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. సరే.. ఇదంతా పక్కనపెడితే.. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేశాడు తలా ధోని. మరి ఆ రికార్డు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.!
ఇప్పటిదాకా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఆర్సీబీ కెప్టెన్‌గా 41.97 సగటుతో 4994 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే 2022లో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కానీ ధోని ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గానే బరిలోకి దిగుతున్నాడు. దీంతో కోహ్లీ ఫీట్‌ను ధోని అందుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనీ ఇప్పటివరకు 4660 పరుగులు చేశాడు. 138 స్ట్రైక్‌రేట్‌తో 22 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక ఈ సీజన్‌లో ధోని మరో 335 పరుగులు చేస్తే చాలు, విరాట్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. అయితే ఇక్కడొక ఆసక్తికర విషయమేంటంటే.. ధోని ఎక్కువగా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ అయ్యి.. ఆడితేనే ధోని ఈ రికార్డును కొట్టే ఛాన్స్ ఉంది.
కేవలం ధోనీ మాత్రమే కాదు, కేఎల్ రాహుల్ కూడా విరాట్ రికార్డును సమం చేయడం లేదా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యధికంగా 5 సెంచరీలు చేయగా, కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ 3 సెంచరీలు సాధించాడు. మరో రెండు సెంచరీలు సాధిస్తే.. కోహ్లీ రికార్డును రాహుల్ సమం చేస్తాడు. ఒకవేళ 3 శతకాలు కొడితే.. విరాట్ రికార్డు బద్దలు కావడం ఖాయం. మరి ఐపీఎల్ 17వ సీజన్‌లో విరాట్ రికార్డును ధోనీ, కేఎల్ రాహుల్‌లో ఎవరో బద్దలు కొడతారో వేచి చూడాలి.
𝐓𝐇𝐈𝐒 𝐈𝐒 𝐈𝐓 🤩
For every role, we’ve found our match
And we believe they can hit the Purple Patch!
Signed today or retained before,
This is our #𝗖𝗹𝗮𝘀𝘀𝗢𝗳𝟮𝟬𝟮𝟰#PlayBold #BidForBold #IPLAuction #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/5bskDt4eGa— Royal Challengers Bangalore (@RCBTweets) December 19, 2023
Living the semma life! 🤳🏻💛#WhistlePodu @snj10000 @BritishEmpireOf pic.twitter.com/UDZwOdm1Tu
— Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2024