
Best Batting Strike Rate In IPL 2024: ఐపీఎల్ (IPL) 2024లో ఇప్పటివరకు తుఫాన్ బ్యాటింగ్ కనిపించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నమెంట్ చరిత్రలోనే అతిపెద్ద స్కోరు కూడా నమోదు చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన ఒక బ్యాట్స్‌మెన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. అతని స్ట్రైక్ రేట్‌తో పోల్చితే వేగంగా బ్యాటింగ్ చేస్తున్న సునీల్ నరైన్, హెన్రిచ్ క్లాసెన్ కూడా తేలిపోయారు. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ శిష్యుడు, గురువులా లెఫ్టీ కూడా ఆడతాడు.
ఈ సీజన్‌లో హైదరాబాద్ తరపున టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నాం. హైదరాబాద్ తన సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో సీజన్‌లో నాలుగో మ్యాచ్ ఆడింది. అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 308.33లుగా నిలిచింది. ఈ వేగవంతమైన ఇన్నింగ్స్‌కు అతను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టైటిల్‌ను అందుకున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో కనీసం 50 బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్లలో అభిషేక్ శర్మ స్ట్రైక్ అత్యుత్తమంగా నిలిచింది. అతను 217.56 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ 4 మ్యాచ్‌ల్లో 161 పరుగులు చేశాడు. ఈ బెస్ట్ స్ట్రైక్ రేట్ జాబితాలో కోల్‌కతాకు చెందిన సునీల్ నరైన్ రెండో స్థానంలో, హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ మూడో స్థానంలో నిలిచారు.
217.56 – అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
206.15 – సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
203.44 – హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
180.64 – ట్రావిస్ హెడ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
175.90 – నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్)
అభిషేక్ తన T20 కెరీర్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 90 ఇన్నింగ్స్‌లలో 30.10 సగటు, 148.98 స్ట్రైక్ రేట్‌తో 2348 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 3 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా బౌలింగ్‌లో 30 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..