
ఐపీఎల్ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై జట్లు ఘన విజయం సాధించింది. అంతకు ముందు బెంగళూరు తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడాడు దినేశ్ కార్తీక్. కొన్ని రోజుల క్రితమే తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ మరోసారి ఇదే విషయంపై స్పందించాడు. టీమిండియా తరఫున ఆడిన మోస్ట్ ట్యాలెంటెడ్ వికెట్ కీపర్లలో ఒకరైన దినేష్ కార్తీక్ IPL ప్రారంభం నుండి ఉన్నాడు. ఇప్పటి వరకు మొత్తం ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కార్తీక్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాకముందే కార్తీక్‌కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని వార్తలు వచ్చాయి. అదేవిధంగా, CSKతో జరిగిన మ్యాచ్ తర్వాత, చెపాక్‌లో ఇది అతని చివరి మ్యాచ్ కాదా అని కార్తీక్‌ను ఒక ప్రశ్న అడిగారు మీడియా రిపోర్టర్లు. దీనికి అతను ‘చెపాక్‌లో ప్లేఆఫ్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నందున నేను ఇక్కడ మరో మ్యాచ్ ఆడగలను. ఒకవేళ మా జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించకుంటే, ఈ మైదానంలో ఇదే నా చివరి మ్యాచ్’ అని సమాధానం ఇచ్చాడు.
రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్న కార్తీక్.. కామెంటరీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. ఇంతకు ముందు భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్‌లో కార్తీక్ కామెంటరీ చేసేవాడు. అయితే ఐపీఎల్‌కు సిద్ధం కావాల్సి రావడంతో అతను వ్యాఖ్యానాన్ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. CSKతో జరిగిన తొలి మ్యాచ్‌లో, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన RCBని మెరుపు ఇన్నింగ్స్ తో గట్టెక్కించాడు దినేష్. అనూజ్ రావత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 50 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టుకు భారీ స్కోరు అందించాడు. కార్తీక్ 26 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రావత్, కార్తీక్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ 173 పరుగులు చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
𝗗𝗶𝗻𝗲𝘀𝗵 𝗞𝗮𝗿𝘁𝗵𝗶𝗸 𝗮𝗻𝗱 𝘁𝗵𝗲 𝗖𝗵𝗲𝗻𝗻𝗮𝗶 𝗖𝗼𝗻𝗻𝗲𝗰𝘁𝗶𝗼𝗻
We sat down with Dinesh Karthik himself, his dad Krishna Kumar, best friends Malolan and Shanker Basu, to bring out stories about the city that shaped the kind, loving and exceptional cricketer who we… pic.twitter.com/aAHsFHf3rK
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..