
Punjab Kings vs Delhi Capitals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో తొలి డబుల్ హెడర్ శనివారం (మార్చి 23) జరగనుంది. అంటే ఒకే రోజు రెండు, రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి.ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లూ ఎదురుచూస్తున్నాయి. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో పంజాబ్ గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కాగా, గత సీజన్‌లో ఢిల్లీ 10 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యద్వేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మరొక విశేషమేమిటంటే.. రోడ్డు ప్రమాదం కారణంగా కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీకి చెందిన నలుగురు విదేశీ ఆటగాళ్లలో షే హోప్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు. లివింగ్‌స్టన్, రబడ, సామ్ కర్రాన్ మరియు జానీ బెయిర్‌స్టోలు పంజాబ్‌కు చెందిన నలుగురు విదేశీ ఆటగాళ్లు.పంజాబ్, ఢిల్లీ మధ్య ఇంతకు ముందు 32 మ్యాచ్‌లు జరిగాయి, వాటిలో పంజాబ్ 16 గెలిచింది, ఢిల్లీ 15 గెలిచింది. 1 మ్యాచ్ టై అయింది.
Lefties unite 🤝
Which opener will get going today? 🤔
Follow the match ▶️https://t.co/ZhjY0W03bC#TATAIPL | #PBKSvDC pic.twitter.com/ksz9aMx2p8
— IndianPremierLeague (@IPL) March 23, 2024
పంజాబ్ కింగ్స్ జట్టు (ప్లేయింగ్ -XI)
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ -XI)
రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షే హోప్, ట్రిస్టన్ స్టబ్స్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.
What’s special about today? Rishabh Pant will wear the DC Match Jersey after 672 days 🕸️#YehHaiNayiDilli #PBKSvDC #IPL2024 pic.twitter.com/H5HB8SBrRR
— Delhi Capitals (@DelhiCapitals) March 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..