
ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటతీరు మరీ తీసికట్టుగా లేకపోయినా అభిమానులు ఆశించిన స్థాయిలో ఆడడం లేదన్నది వాస్తవం. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో 3 మ్యాచుల్లో గెలిచింది. మరో 2 మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీనికి ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకపోవడమే. మరీ ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ పేలవ ఫామ్ లక్నోను ఆందోళనకు గురిచేస్తుంది. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు దేవదత్ పడిక్కల్. తొలి ఎడిషన్‌లో భారీగా పరుగులు సాధించి టీమిండియాకు కాబోయే సూపర్‌స్టార్‌గా నిలిచాడు. కానీ సీజన్ గడిచేకొద్దీ, పడిక్కల్ ఆట తగ్గుముఖం పట్టింది. IPL 2024కి ముందు ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ జట్టు నుండి లక్నో సూపర్‌జెయింట్స్ జట్టులో చేరాడు పడిక్కల్. అంతకు దేశీయ క్రికెట్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ధనాధన్ లీగ్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోని ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తరఫున తొలి టెస్టు మ్యాచ్ ఆడిన పడిక్కల్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 65 పరుగులు చేశాడు.
తన అరంగేట్రం టెస్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో దేవదత్ పడిక్కల్‌పై లక్నో సూపర్ జెయింట్స్ భారీగా అంచనాలు పెట్టుకుంది. కానీ అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా రెండంకెల స్కోరు చేయలేకపోయాడు పడిక్కల్. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న అతను లక్నో తరుపున 5 మ్యాచ్‌ల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే అవుట్ అయిన పడిక్కల్ పంజాబ్‌పై 9, RCBపై 6, గుజరాత్ టైటాన్స్‌పై 7, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో పడిక్కల్ 5 సగటుతో 25 పరుగులు మాత్రమే చేశాడీ యంగ్ ప్లేయర్.
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న దేవదత్ పడిక్కల్ కు తదుపరి మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం దక్కడం అనుమానమే. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే మెగా వేలంలో పడిక్కల్‌ను ఎవరు కొనుగోలు చేయకపోవచ్చు కూడా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..