IPL 2023: సన్‌రైజర్స్ కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు.. టీ20 విధ్వంసకర ఓపెనర్‌కే ఎక్కువ ఛాన్స్.?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సీజన్ 16 కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి జరిగిన మినీ వేలంలో పలు కీలకమైన ఆటగాళ్లను..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సీజన్ 16 కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి జరిగిన మినీ వేలంలో పలు కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసి.. తమ జట్టును సన్‌రైజర్స్ హైదరాబాద్ మరింత బలోపేతం చేసుకుంది. వేలానికి ముందు కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న SRH జట్టు.. ఆ తర్వాత మరో 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం 25 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ ఎవరన్నది.? SRH ఫ్రాంచైజీ ముందున్న అతిపెద్ద సవాల్. ఎందుకంటే గత సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టుకు నాయకత్వం వహించిన కేన్ విలియమ్సన్ ఈసారి గుజరాత్ టైటాన్స్‌కు చేరాడు. కాబట్టి ఈసారి ఎస్‌ఆర్‌హెచ్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది. ఇక ఈ రేసులో ముగ్గురు ప్లేయర్స్ ముందంజలో ఉన్నారు. వారిలో ఎవరికి నాయకత్వం ఇస్తారన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. మరి ఆ ఆటగాళ్లు ఎవరన్నది ఇప్పుడు చూద్దాం.
మయాంక్ అగర్వాల్:
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్‌ను ఈసారి SRH ఫ్రాంచైజీ రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం మయాంక్‌ను SRH కెప్టెన్‌గా ఎంపిక చేస్తారన్న చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే గత సీజన్‌లో పంజాబ్ జట్టును 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలను అందించాడు మయాంక్ అగర్వాల్. వచ్చే సీజన్‌లో హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడంలో మయాంక్ ముందు వరుసలో ఉన్నాడని తెలుస్తోంది.
ఐదాన్ మార్క్‌రమ్:
ఐపీఎల్ 2022లో SRH తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు మార్క్‌రమ్. గతంలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుకు నాయకత్వం వహించిన మార్క్‌రమ్.. ఈసారి SRH జట్టుకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ హైదరాబాద్ ఫ్రాంచైజీ విదేశీ ఆటగాడికి నాయకత్వం ఇవ్వాలనుకుంటే.. మార్క్‌రమ్ ముందుంటాడు.
భువనేశ్వర్ కుమార్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడన్న చర్చ జరుగుతోంది. గత 7 మ్యాచ్‌ల్లో SRH జట్టుకు భువనేశ్వర్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. మరి ఈ ముగ్గురిలో ఎవరికి SRH జట్టు పగ్గాలు లభిస్తాయో వేచి చూడాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్:
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకేల్ హొస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ వ్యాస్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్హాక్ ఫరూఖీ.