IPL 2023: నెట్ బౌలర్‌గా రప్ఫాడించాడు.. కట్‌చేస్తే.. రూ. 50లక్షలతో లక్కీ ఛాన్స్ పట్టేశాడు.. ఆ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ ఎవరంటే?

|

Apr 14, 2023 | 4:54 PM

ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రయాణం అంత సులభం కాలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ లీగ్‌లో అడుగుపెట్టేందుకు అతడు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అరంగేట్రం చేయడానికి ముందు రెండేళ్లపాటు నెట్ బౌలర్‌గా చెమటోడ్చాడు.

IPL 2023: నెట్ బౌలర్‌గా రప్ఫాడించాడు.. కట్‌చేస్తే.. రూ. 50లక్షలతో లక్కీ ఛాన్స్ పట్టేశాడు.. ఆ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ ఎవరంటే?
Fazalhaq Farooqi
Follow us on

ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రయాణం అంత సులభం కాలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ లీగ్‌లో అడుగుపెట్టేందుకు అతడు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అరంగేట్రం చేయడానికి ముందు రెండేళ్లపాటు నెట్ బౌలర్‌గా చెమటోడ్చాడు.

ఫజల్‌హాక్ ఫరూఖీ 2020లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడానికి ముందు పంజాబ్ కింగ్స్ నెట్ బౌలర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత, మరుసటి సంవత్సరంలో, అంటే 2021 సంవత్సరంలో, అతను చెన్నై సూపర్ కింగ్స్ నెట్ బౌలర్‌గా మారాడు. అయితే ఈ సమయంలో అతనికి ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.

2022లో ఫజల్‌హక్ ఫరూకీకి ఐపీఎల్ తలుపులు తెరుచుకున్నాయి. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు హైదరాబాద్ అతన్ని అలాగే అట్టిపెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఫజల్‌హాక్ ఫరూఖీ 9 మే 2022న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై IPL అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సీన్ అబాట్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో అబాట్ చాలా ఖరీదైన వ్యక్తి అని నిరూపించుకున్నాడు.

ఆఫ్ఘనిస్థాన్ యువ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 5 వికెట్లు తీయడంలో విజయం సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 32 పరుగులకు 2 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ తరపున 2 మ్యాచ్‌లు ఆడాడు.

వైట్ బాల్ క్రికెట్‌లో ఫజల్‌హక్ ఆఫ్ఘనిస్తాన్ కీలక ఆటగాడి నిలిచాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో తన జట్టు కోసం 10 ODIలు, 22 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో వన్డేల్లో 17 వికెట్లు, టీ20ల్లో 26 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..