సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. మొదటి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో విజృంభించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. వరుణ్ చక్రవర్తి (15/4), సుయాశ్ శర్మ (30/3), సునీల్ నరైన్ (16/2) ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. విరాట్ కోహ్లీ (21), డుప్లెసిస్ (23), డేవిడ్ విల్లీ (20), బ్రేస్‌వెల్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతాబ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఒకానొక దశలో ఆజట్టు 96 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే డేవిడ్ విల్లీ, ఆకాశ్ దీప్ చివరి వికెట్ కు 27 పరుగులు జోడించడంతో చివరకు 123 పరుగులకు ఆలౌటైంది. కిర్రాక్ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కోల్ కతా బ్యాటర్లలో శార్దూల్ ఠాకూర్, రహమానుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. శార్దూల్ ఠాకూర్ 29 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక రహమానుల్లా 44 బంతుల్లో 57 రన్స్ చేశాడు. అతని స్కోర్ లో 6 ఫోర్లు, 3 సిక్సలు ఉన్నాయి. రింకూ సింగ్ కూడా (33 బంతుల్లో 46, . 2 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, బ్రేస్ వెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
We came home. WE CAME HOME! ? pic.twitter.com/W9xisLcjdy
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2023
El-Primero ends with a W pic.twitter.com/pgtiafQiaQ
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..