IPL 2023: మినీ వేలానికి ముందు సీఎస్‌కే గుడ్ న్యూస్.. ఫ్యూచర్ కెప్టెన్‌ను అట్టిపెట్టుకున్న యాజమాన్యం!

|

Nov 14, 2022 | 12:22 PM

కొచ్చి వేదికగా డిసెంబర్ 23వ తేదీన వచ్చే సీజన్‌కు సంబంధించి వేలం జరగనుంది. ఈ నేపధ్యంలో ఫ్రాంచైజీలు..

IPL 2023: మినీ వేలానికి ముందు సీఎస్‌కే గుడ్ న్యూస్.. ఫ్యూచర్ కెప్టెన్‌ను అట్టిపెట్టుకున్న యాజమాన్యం!
Chennai Super Kings
Follow us on

ఐపీఎల్-2023కి వడివిడిగా అడుగులు పడుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23వ తేదీన వచ్చే సీజన్‌కు సంబంధించి వేలం జరగనుంది. ఈ నేపధ్యంలో ఫ్రాంచైజీలు ఏయే ప్లేయర్స్ రిలీజ్ చేయాలో.. ఎవరిని అట్టిపెట్టుకోవాలో అనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఫ్రాంచైజీలు వదులుకుంటున్న ప్లేయర్స్ జాబితాను నవంబర్ 15లోగా ప్రకటించాలని బీసీసీఐ డెడ్‌లైన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ వదులుకునే ప్లేయర్స్ లిస్టును ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తోంది. సీఎస్కే వచ్చే ఏడాది రవీంద్ర జడేజాను రిలీజ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా జడేజాను అట్టిపెట్టుకున్నట్లు సమాచారం. దీనికి ఆ జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని మధ్యవర్తిత్వం వహించడమే కారణమట. జడేజాపై ప్రతీసారి నమ్మకం ఉంచిన ధోని.. తన తర్వాత కెప్టెన్‌గా జడ్డూ ఉంటాడని గతంలో చెప్పిన సందర్భాలు లేకపోలేదు. మరోవైపు గతేడాది యాజమాన్యంతో విబేధాలు కారణంగా జడేజా లీగ్ మధ్యలోనే గాయం సాకుతో వైదొలిగిన సంగతి తెలిసిందే.

  • రిలీజ్ చేసే ప్లేయర్స్:

క్రిస్‌ జోర్డన్‌, ఆడమ్‌ మిల్నే, మిచెల్‌ సాంట్నర్‌

  • రిటైన్ ప్లేయర్స్:

ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబే, రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే, ముకేశ్‌ చౌదరీ, డ్వేన్‌ ప్రిటోరియస్‌, దీపక్‌ చాహర్‌