IPL 2023: ఈ 5గురి ప్లేయర్స్‌కి ఇదే చివరి ఐపీఎల్.. లిస్టులో ధోనితో పాటు విధ్వంసకర ఓపెనర్.. ఎవరంటే?

|

Mar 27, 2023 | 11:06 AM

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభమవుతోంది. ఈ సీజన్‌లో పలువురు యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. ఐదుగురు సీనియర్ ఆటగాళ్లకి మాత్రం ఇదే చివరి ఐపీఎల్ అయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది.

IPL 2023: ఈ 5గురి ప్లేయర్స్‌కి ఇదే చివరి ఐపీఎల్.. లిస్టులో ధోనితో పాటు విధ్వంసకర ఓపెనర్.. ఎవరంటే?
Ipl 2023
Follow us on

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభమవుతోంది. ఈ సీజన్‌లో పలువురు యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. ఐదుగురు సీనియర్ ఆటగాళ్లకి మాత్రం ఇదే చివరి ఐపీఎల్ అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయ్. ఇటీవల జరిగిన మినీ వేలంలో దాదాపు అన్ని జట్లూ కూడా యువ ప్లేయర్స్‌పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవో లాంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్ నుంచి వైదొలిగారు. మరి వీరితో పాటు వచ్చే ఏడాది లీగ్‌కు దూరం కానున్న మరో ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..!

  • ఎం.ఎస్.ధోని:

ఐపీఎల్ 2023 మహేంద్ర సింగ్ ధోని ఆఖరి సీజన్‌గా కనిపిస్తోంది. టీమిండియా నుంచి రిటైర్ అయిన ఈ దిగ్గజ బ్యాటర్.. చెన్నైలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాలని భావిస్తున్నాడు. అలాగే ధోని రిటైర్ అయిన అనంతరం.. సీఎస్కే పగ్గాలు బెన్ స్టోక్స్ తీసుకునే అవకాశం ఉంది.

  • దినేష్ కార్తీక్:

దినేష్ కార్తీక్‌కు ఇప్పుడు 38 ఏళ్లు. టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాలో చోటు దక్కినా ఫినిషర్‌గా పెద్దగా రాణించలేకపోయాడు. అలాగే అతడికి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు. ఎందుకంటే కామెంటేటర్‌గా కార్తీక్ బాగా రాణిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి
  • డేవిడ్ వార్నర్:

ఐపీఎల్ 2023 డేవిడ్ వార్నర్‌కు చివరి ఐపీఎల్ అవుతుంది. ఈ మధ్య ఫామ్ లేమితో సతమతమవుతున్న వార్నర్.. వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • అమిత్ మిశ్రా:

మిశ్రా వయస్సు 41 ఏళ్లు. అతడి వయస్సు దృష్ట్యా గతేడాది జరిగిన వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. ఈసారి లక్నో సొంతం చేసుకోగా.. వచ్చే సీజన్‌లో అయితే కనిపించే అవకాశం లేదు. ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు.

  • అంబటి రాయుడు:

చెన్నై సూపర్ కింగ్స్‌ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అంబటి రాయుడికి ఇదే ఆఖరి ఐపీఎల్ కావచ్చు. అతడి వయస్సు 38 ఏళ్లు. రాయుడికి గాయాలు, ఫామ్ ఇబ్బంది పెడుతోంది.. అందుకే ఇదే చివరిది అవుతుంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..