IPL 2023 Auction: IPL 16వ సీజన్‌లో కొంతమంది ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మరికొందలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. వీరిలో కోట్లాది రూపాయలు వెచ్చించి తమ జట్టులో చేర్చుకున్న ప్లేయర్లు కూడా ఉన్నారు. అయితే, ఫ్రాంచైజీలు వీరి కోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. అలాంటి ఆటగాళ్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం..
ఈ జాబితాలో మొదటి పేరు జింబాబ్వే అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ ఆటగాడు సికందర్ రజా. ఈ ఆటగాడు గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలిపించాడు. ఇది కాకుండా, సికందర్ రజా ప్రపంచవ్యాప్తంగా ఆడిన అనేక టీ20 లీగ్‌లలో మంచి ప్రదర్శన చేశాడు. ఈ కారణంగా పంజాబ్ కింగ్స్ అతనిని రూ. 50 లక్షలు బేస్ ప్రైస్ ఇచ్చి తమ జట్టులో చేర్చుకుంది. అయితే అతను పంజాబ్ కోసం ఇప్పటివరకు ఒక్క మంచి ప్రదర్శన కూడా చేయలేకపోయాడు.
సికందర్ రజా పంజాబ్ కింగ్స్ తరపున ఇప్పటివరకు మొత్తం 3 మ్యాచ్‌లు ఆడాడు. 7.33 సగటు, 104.76 స్ట్రైక్ రేట్‌తో 22 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో బౌలింగ్‌లోనూ ఇప్పటి వరకు ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ సమయంలో, ఎకానమీ రేటు కూడా 9.80గా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంగ్లాండ్ హ్యారీ బ్రూక్‌ను చాలా హైలైట్ చేసింది. ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఆటగాడు అసమాన ప్రదర్శన చేశాడు. దీని కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఆటగాడిని రూ.13.25 కోట్లు చెల్లించి తమ జట్టులో చేర్చుకుంది. అయితే అతను ఇప్పటివరకు 3 మ్యాచ్‌లలో 9.67 సగటు, 74.36 స్ట్రైక్ రేట్‌తో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఈ ఆస్ట్రేలియన్ యువ ఆటగాడి అద్భుత ప్రతిభను, ఫామ్‌ను చూసిన ముంబై ఇండియన్స్ రూ. 17.50 కోట్లు వెచ్చించి అతడిని తమ జట్టులోకి చేర్చుకుంది. అయితే ఈ ఆటగాడు ఇప్పటి వరకు 8.50 సగటు, 113.33 స్ట్రైక్ రేట్‌తో 17 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో అతను బౌలింగ్‌లో 1 వికెట్ మాత్రమే తీశాడు.
ఇటువంటి పరిస్థితిలో, ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ తమ జట్లను ఇప్పటివరకు చాలా నిరాశపరిచారు. అదే సమయంలో ఫ్రాంచైజీలు వేసిన ఇంత పెద్ద పందెం ఇప్పటి వరకు ఫలించలేదు. మరి రానున్న కాలంలో ఈ ఖరీదైన ఆటగాళ్లు తమ సత్తా చాటగలరో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..