Video: స్ప్రింగ్‌లా గాల్లో ఎగిరి, ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. కోహ్లీ ఫ్రెండ్‌నే మడతపెట్టేశాడుగా.. వీడియో చూస్తే పరేషానే..

|

Apr 15, 2023 | 5:44 PM

RCB vs DC: ఐపీఎల్ 16వ సీజన్ 20వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుతో తలపడుతోంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది.

Video: స్ప్రింగ్‌లా గాల్లో ఎగిరి, ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. కోహ్లీ ఫ్రెండ్‌నే మడతపెట్టేశాడుగా.. వీడియో చూస్తే పరేషానే..
Aman Khan One Handed Catch
Follow us on

RCB vs DC, Match 20 IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ 20వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుతో తలపడుతోంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్న యువ ఆటగాడు అమన్ ఖాన్.. ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌కు భారీ షాక్ ఇచ్చాడు. అద్భుతమైన క్యాచ్‌ను ఒంటి చేత్తో పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీకి ఓపెనింగ్‌లో వచ్చిన కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వేగంగా పరుగులు సాధించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో, ఢిల్లీ నుంచి ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ మార్ష్ ఓవర్‌లోని నాలుగో బంతిని డు ప్లెసిస్ మిడ్ వికెట్ వైపు ఆడేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అమన్ ఖాన్ గాలిలో కుడివైపుకి దూకి, అద్భుతమైన క్యాచ్ పట్టాడు. డు ప్లెసిస్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ 16 బంతుల్లో 22 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 42 పరుగుల స్కోరు వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తొలి దెబ్బ తగిలింది.

బ్యాట్‌తో సత్తా చూపని అమన్..

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అమన్ హకీమ్ ఖాన్, ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. 3 ఇన్నింగ్స్‌లలో అమన్ 5.67 సగటుతో 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇది కాకుండా, అతను బౌలింగ్‌లోనూ ఎటువంటి వికెట్ తీసుకోలేకపోయాడు.

మ్యాచ్ పరిస్థితి ఎలా ఉందంటే?

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సహాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 20వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు 175 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. అనంతరం ఢిల్లీ 1.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 1 పరుగు మాత్రమే చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నాడు.

మిచెల్ మార్ష్ సున్నా వద్ద ఔటయ్యాడు. అంతకుముందు పృథ్వీ షా (0 పరుగు)ను అనుజ్ రావత్ డైరెక్ట్ హిట్ కొట్టి రనౌట్ చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో కోహ్లి 47వ అర్ధ సెంచరీ సాధించాడు. మహిపాల్ లోమ్రోర్ (26 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (24 పరుగులు), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (22 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..