IPL 2023 Final: ఐపీఎల్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఆ జట్టే ఛాంపియన్‌.. రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

| Edited By: seoteam.veegam

May 28, 2023 | 9:52 AM

గత నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ వస్తోన్న ఐపీఎల్‌ ఇక క్లైమాక్స్‌కు చేరుకుంది. ధనాధన్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది.

IPL 2023 Final: ఐపీఎల్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఆ జట్టే ఛాంపియన్‌.. రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?
Ipl 2023 Final
Follow us on

గత నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ వస్తోన్న ఐపీఎల్‌ ఇక క్లైమాక్స్‌కు చేరుకుంది. ధనాధన్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. జరగనున్న ఈ మ్యాచ్‌కు ఇప్పుడు వర్షం ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అయితే అదృష్టవశాత్తూ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఆగిపోయింది . అయినా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే ఏం జరుగుతుందనేది ప్రశ్న. ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే ఐపీఎల్ రెయిన్ రూల్స్ ప్రకారం మ్యాచ్ జరగనుంది. అంటే వర్షం పడితే మ్యాచ్ నిర్వహించేందుకు కొన్ని నిబంధనలు రూపొందించారు. ఈ నియమాల ప్రకారం ఫైనల్‌కు ముందు వర్షం కురిసి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా ఓవర్లలో ఏ మాత్రం కోత ఉండదు. అంటే రాత్రి 9.40 గంటలకు ముందు మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్ కట్ ఉండదు. ఇరు జట్లు 20 ఓవర్లు ఆడతాయి. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రాత్రి 9.40 గంటల తర్వాత ప్రారంభమైతే మాత్రం ఓవర్లను కుదిస్తారు. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 5 ఓవర్లు ఆడాలి.

ఇక నిర్ణీత సమయంలోగా మ్యాచ్ ప్రారంభంకాకపోతే అదనపు సమయం కూడా కేటాయిస్తారు. దీని ద్వారా 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ 5 ఓవర్ల మ్యాచ్ రాత్రి 11.56 గంటలకు ప్రారంభమై 12.50 గంటలకు ముగుస్తుంది. ఇక 11.56 నుంచి 12.50 మధ్య 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అయితే సూపర్ ఓవర్ నిర్వహించాలంటే పిచ్, గ్రౌండ్ ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. దీని ప్రకారం సూపర్ ఓవర్ మ్యాచ్ 12.50కి ప్రారంభమవుతుంది. ఇకపై సూపర్‌ ఓవర్‌ ఆడలేకపోతే ఫైనల్‌ మ్యాచ్‌ రద్దవుతుంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దైతే, లీగ్ స్థాయి పాయింట్ల పట్టిక ద్వారా ఛాంపియన్స్ జట్టును నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించలేకపోతే, లీగ్ దశలో 70 మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. కాగా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డేని ప్రకటించలేదు. కాబట్టి, IPL 2023 ఫైనల్ విజేత ఎవరో ఆదివారమే (మే28) తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..