IPL 2022: IPL 2021 ముగిసిన తర్వాత, అందరి మదిలో ఒకటే ప్రశ్న.. ధోని IPL 2022లో ఆడతాడా లేదా? ఈ ప్రశ్నకు ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సమాధానం ఇచ్చాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఈ ప్రశ్నకు చెప్పడానికి ఇంకా సమయం ఉందని తెలిపాడు. ఇది నవంబర్ నెల. IPL 2022 ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. కాబట్టి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ.. ‘నేను దాని గురించి ఆలోచిస్తాను. ఐపీఎల్ 2022కి ఇంకా చాలా సమయం ఉంది. మనం ప్రస్తుతం నవంబర్ నెలలోనే ఉన్నాం. టోర్నమెంట్ ఏప్రిల్‌లో జరగనుంది’ అని తెలిపాడు. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. పసుపు జెర్సీతో జట్టుకు ఇది నాలుగో ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఈ టైటిల్ గెలిచిన తర్వాత కూడా, తదుపరి సీజన్‌లో పాల్గొనడంపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. కానీ, ధోని స్పష్టంగా ఏమీ చెప్పలేదు. అయితే ప్రస్తుతానికి తన వారసత్వాన్ని వదిలిపెట్టబోనని ఖచ్చితంగా అన్నాడు. IPL 2022లో ఆడటం పెద్ద సంకేతంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చెన్నైలో చివరి టీ20 ఆడాలని ధోనీ భావిస్తున్నాడు..
IPL 2021లో CSK విజయానికి సంబంధించి జరిగిన కార్యక్రమంలో, ధోని IPL 2022లో ఆడటంపై ఓ క్లూ కూడా అందించాడు. అతను చెన్నైలో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాలనుకుంటున్నాడు. అది వచ్చే ఏడాది అయినా లేదా 5 సంవత్సరాల తర్వాత అనేది చెప్పలేదు. స్వస్థలం రాంచీలో తన చివరి వన్డే ఆడానని, అలాగే తన చివరి టీ20 కూడా ఎక్కడ ఆడాలో కూడా తెలిపాడు. చెపాక్ మైదానంలో చివరి టీ20 ఆడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
IPL 2022లో బరిలోకి 10 జట్లు..
IPL తదుపరి సీజన్ అంటే IPL 2022లో చాలా మార్పులు ఉంటాయి. తొలిసారిగా 8 జట్లకు బదులుగా 10 జట్లు ఆడనున్నాయి. IPL 2022 నుంచి అహ్మదాబాద్, లక్నోలో రెండు కొత్త జట్లు ఆడనున్నాయి. IPL 2021 చివరి మ్యాచ్ తర్వాత, స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ధోనీ ఇలా అన్నాడు, “CSKకి ఏది మంచిదో మేం నిర్ణయిస్తాం. బలమైన జట్టును తయారు చేసుకోవాలి. ఫ్రాంఛైజీకి ఏది మంచిదో అదే చేస్తాం. మేం రాబోయే 10 సంవత్సరాల పాటు ప్రదర్శన ఇచ్చే బృందాన్ని నిర్మించాలి” అని పేర్కొన్నాడు.
A promise from #Thala…#Anbuden awaiting… ??#WhistlePodu #Yellove pic.twitter.com/zGKvtRliOY
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) November 20, 2021
SMAT 2021: 4 బంతుల్లో 4 వికెట్లు.. యార్కర్లతో ప్రత్యర్ధులకు చుక్కలు.. దుమ్మురేపిన రాహుల్ టీం బౌలర్.!