Ravindra Jadeja: కేకేఆర్‌ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన సీఎస్‌కే ఆల్‌రౌండర్.. ధోనీ ఫ్యాన్స్ కూడా ఫైర్.. ఎందుకంటే?

|

Jan 10, 2022 | 12:08 PM

IPL 2022: భారత ఆలౌరౌండర్ రవీంద్ర జడేజాకు, ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన కేకేఆర్ (కోల్‌కతా నైట్‌ రైడర్స్)‌ మధ్య ఓ ట్వీట్ నెట్టింట్లో సందడి చేసింది.

Ravindra Jadeja: కేకేఆర్‌ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన సీఎస్‌కే ఆల్‌రౌండర్.. ధోనీ ఫ్యాన్స్ కూడా ఫైర్.. ఎందుకంటే?
Ravindra Jadeja Vs Kkr
Follow us on

Ravindra Jadeja: భారత ఆలౌరౌండర్ రవీంద్ర జడేజాకు, ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన కేకేఆర్ (కోల్‌కతా నైట్‌ రైడర్స్)‌ మధ్య ఓ ట్వీట్ నెట్టింట్లో సందడి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ‌తరపున ఆడుతోన్న జడేజా ఆదివారం కేకేఆర్‌ టీమ్ ఓ ట్వీట్ చేసింది. అది కూడా‌ ధోనీని ఉద్దేశించి చేయడంతో.. జడేజా ఆ ట్వీట్‌కు కౌంటర్‌గా మరో ట్వీట్ చేశాడు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌(AUS vs ENG) టీంల మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఆట చివర్లో ఇంగ్లీష్ టీం టెస్టును డ్రా చేసుకోవాడానికి తెగ పోరాడుతోంది. చివరి వికెట్ తీసి విజయం సాధించాలని ఆసీస్ కూడా అదే స్ఫూర్తితో పోరాడింది. కానీ, ఇంగ్లండ్ టీం అద్భుతంగా ఆడడంతో చివరి వికెట్‌ను కోల్పోకుండా టెస్టును డ్రా చేసుకుంది.

ఆస్ట్రేలియా సారథి పాట్‌ కమిన్స్‌ ఇంగ్లండ్ వికెట్ తీసేందుకు అద్భుతంగా ఫీల్డింగ్‌‌ను ఏర్పాటు చేశాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్‌ చూట్టూ ఫీల్డర్లను ఉంచాడు. కానీ, వారి ప్రయాత్నాలను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ దెబ్బకొట్టారు. అయితే ఇలాంటి ఫీల్డింగ్‌ను కోల్‌కత్తా నైట్ రైడర్స్‌ సారథి గౌతమ్ గంభీర్ ఐపీఎల్‌లో కూడా ఇలాంటి పీల్డింగ్‌నే సెట్ చేశాడు. అది కూడా ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పు కావడంతో ఆ ట్వీట్ నెట్టింట్లో హీటెక్కించింది.

రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ బ్యాట్స్‌మెన్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో కేకేఆర్ సారథి గంభీర్ సేమ్ టూ సేమ్ ఇలాంటి ఫీల్డింగ్‌నే సెట్ చేశాడు. దీంతో ఇదే సీన్‌ను తాజాగా యాషెస్ సిరీస్‌లోని మ్యాచును పోల్చుతూ కేకేఆర్ ఓ ట్వీట్ చేసింది. ఇందుకు ఓ క్యాఫ్షన్‌ కూడా ఇచ్చింది..‘టెస్ట్ మ్యాచులో క్లాసిక్ సీన్.. టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్ ఇలానే ఉంటుంది’ అంటూ ఫోటోలతో ట్విట్టర్లో షేర్ చేసింది.

దీంతో జడ్డూ కేకేఆర్ ట్వీట్‌పై కౌంటర్ ఇస్తూ.. మాస్టర్‌ స్ట్రోక్‌ అంటే అది కాదు. కేవలం అది షో ఆఫ్‌ అంటూ స్మైలీ ఎమోజీతో రిప్లే ఇచ్చాడు. జడేజా కౌంటర్‌తో ధోని ఫ్యాన్స్‌ కూడా కేకేఆర్ ట్వీట్‌పై ఫైరవుతూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఐసీఎల్ 2021లో ఈ రెండు జట్లూ ఫైనల్లో పోటీపడ్డాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అద్భుతంగా ఆడి కేకేఆర్‌పై 27 పరుగులతో గెలుపొందింది. అలాగే 4వసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ టీం జడేజాతో పాటు కెప్టెన్‌ ధోనీ, రుతురాజ్‌, మొయిన్‌ అలీలను రిటైన్ చేసుకుంది.

Also Read:  WTC Points Table: సిడ్నీ టెస్ట్‌ ఎఫెక్ట్.. అగ్రస్థానం కోల్పోయిన ఆసీస్.. టీమిండియా ఏ ప్లేస్‌లో ఉందంటే?

ICC Under 19 World Cup: 11 సిక్స్‌లు, 20 ఫోర్లు, 278 పరుగులు.. విండీస్‌తో వార్మప్‌లో అదరగొట్టిన భారత్..!