DC vs RCB Match Result: IPL- 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోర పరాజయం పాలైన ఆ జట్టు శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. దినేష్ కార్తీక్ మెరుపు అర్ధ సెంచరీ(34 బంతుల్లో 66) కి తోడు జోష్ హేజిల్‌వుడ్ (28/3) సూపర్ స్పెల్‌తో డుప్లెసిన సేన ఢిల్లీపై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా బెంగళూరు ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ కార్తీక్, గ్లెన్ మాక్స్‌వెల్ అర్ధ సెంచరీలతో కోలుకుంది. ఢిల్లీ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి శుభారంభం లభించినప్పటికీ మధ్యలో వరుస వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ (66), పంత్ (34) మినహా మరెవరూ వేగంగా పరుగులు చేయలేకపోయారు. పృథ్వీషా (16), మిచెల్ మార్ష్ (14), రోవ్‌మన్ పావెల్ (0), లలిత్ యాదవ్ (1) పూర్తిగా నిరాశపరిచారు. జోష్ హేజిల్‌వుడ్‌తో పాటు సిరాజ్ (31/2) కట్టుదిట్టంగా బంతులేయడంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు కేవలం 173/7 పరుగులకే పరిమితమైంది. కాగా మెరుపు ఇన్నింగ్స్ తో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన దినేశ్ కార్తీక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. మూడో ఓటమిని మూటగట్టుకున్న ఢిల్లీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
రాణించిన మ్యాక్సీ, కార్తీక్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అనూజ్ రావత్ (0), డుప్లెసిస్ (8) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆతర్వాత కోహ్లీ (12) కూడా రనౌట్‌గా వెనుదిరగడంతో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ప్రభుదేశాయ్ (6)తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. 92 పరుగుల వద్ద మ్యాక్సీ కూడా పెవిలియన్‌కు చేరుకోవడంతో ఆర్సీబీ కష్టాల్లో పడినట్లైంది. అయితే షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడారు. మొదట్లో సంయమనంతో ఆడిన వీరు ఆ తర్వాత ఫోర్లు, సిక్స్ లతో రెచ్చిపోయారు. ముఖ్యంగా కార్తీక్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్స్ లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్ వేసిన 18 ఓవర్లో అతను ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఇక చివరి ఓవర్లోనూ 17 పరుగులు రావడంతో ఢిల్లీ ముందు బెంగళూరు భారీ టార్గెట్‌ను ఉంచింది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (27/1) మాత్రమే కాస్తా పర్వాలేదనిపించాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (48/1), కుల్దీప్ యాదవ్ (46/1), ఖలీల్ అహ్మద్ (36/1) భారీగా పరుగులు ఇచ్చారు.
Back to winning ways. ??
Important 2️⃣ points secured. ✅We look ahead to our next challenge now! ??#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #DCvRCB pic.twitter.com/bPzMfO2lPg
— Royal Challengers Bangalore (@RCBTweets) April 16, 2022
Also Read: RRR Movie: అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కొమ్మ ఉయ్యాల్లో’ పాట వచ్చేసిందోచ్
Jai Shankar: ఉక్రెయిన్‌పై భారత తటస్థ వైఖరి సరియైనదేనంటూ ప్రపంచ దేశాలను ఒప్పించిన దిట్ట జైశంకర్..