ఐపీఎల్ 2022 రిటైన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది.. ఫ్రాంచైజీల వారీగా ఎవరెవరున్నారంటే.!

|

Nov 30, 2021 | 10:37 PM

List of IPL 2022 Retained Released Players: ఐపీఎల్ 2022 రిటైన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. వచ్చే మూడు సీజన్లను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు...

ఐపీఎల్ 2022 రిటైన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది.. ఫ్రాంచైజీల వారీగా ఎవరెవరున్నారంటే.!
IPL 2022 Retention Players List
Follow us on

List of IPL 2022 Retained Released Players: ఐపీఎల్ 2022 రిటైన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. వచ్చే మూడు సీజన్లను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్‌ను ఎంపిక చేశారు. పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్ళ ఎంపికలో షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాయి. దాదాపుగా సీనియర్ ఆటగాళ్లతో పాటు పలు యువ ప్లేయర్స్‌ మెగా ఆక్షన్‌లోకి రానున్నారు. మరి ఫ్రాంచైజీల వారీగా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

రిటైన్ ప్లేయర్స్: విరాట్ కోహ్లి(రూ. 15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌(రూ.11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ. 7 కోట్లు)

పర్స్‌లో మిగిలిన మనీ – రూ. 57 కోట్లు

రిలీజైన కీలక ఆటగాళ్ళు – దేవదూత్‌ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్

ముంబై ఇండియన్స్:

రిటైన్ ప్లేయర్స్: రోహిత్ శర్మ(రూ. 16 కోట్లు), బుమ్రా(రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్(రూ. 6 కోట్లు)

పర్స్‌లో మిగిలిన మనీ – రూ. 48 కోట్లు

రిలీజైన కీలక ఆటగాళ్ళు – హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్

పంజాబ్ కింగ్స్:

రిటైన్ ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్(రూ. 14 కోట్లు), బౌలర్ అర్షదీప్ సింగ్(రూ. 4 కోట్లు)

పర్స్‌లో మిగిలిన మనీ – రూ. 72 కోట్లు

రిలీజైన కీలక ఆటగాళ్ళు – కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, మహమ్మద్ షమీ, షారుఖ్ ఖాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్:

రిటైన్ ప్లేయర్స్: కేన్ విలియమ్సన్(రూ. 14 కోట్లు), ఆల్‌రౌండర్ సమద్(రూ. 4 కోట్లు), బౌలర్ ఉమ్రాన్ మాలిక్(రూ. 4 కోట్లు)

పర్స్‌లో మిగిలిన మనీ – రూ. 68 కోట్లు

రిలీజైన కీలక ఆటగాళ్ళు – డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజ్, జానీ బెయిర్‌స్టో

చెన్నై సూపర్ కింగ్స్:

రిటైన్ ప్లేయర్స్: రవీంద్ర జడేజా(రూ. 16 కోట్లు), ఎం.ఎస్.ధోని(రూ. 12 కోట్లు), మొయిన్ అలీ(రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్(రూ. 6 కోట్లు)

పర్స్‌లో మిగిలిన మనీ – రూ. 48 కోట్లు

రిలీజైన కీలక ఆటగాళ్ళు – సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డుప్లెసిస్, ఎంగిడి

ఢిల్లీ క్యాపిటల్స్:

రిటైన్ ప్లేయర్స్: రిషబ్ పంత్(రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్(రూ. 9 కోట్లు), పృథ్వీ షా(రూ. 7.5 కోట్లు), నోర్తెజా(రూ. 6.5 కోట్లు)

పర్స్‌లో మిగిలిన మనీ – రూ. 47.5 కోట్లు

రిలీజైన కీలక ఆటగాళ్ళు – శిఖర్ ధావన్, అశ్విన్, స్టోయినిస్, స్టీవ్ స్మిత్, శ్రేయాస్ అయ్యర్

కోల్‌కతా నైట్ రైడర్స్:

రిటైన్ ప్లేయర్స్: ఆండ్రీ రస్సెల్(రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి(రూ. 8 కోట్లు), వెంకటేష్ అయ్యర్(రూ. 8 కోట్లు), సునీల్ నరైన్(రూ. 6 కోట్లు)

పర్స్‌లో మిగిలిన మనీ – రూ. 48 కోట్లు

రిలీజైన కీలక ఆటగాళ్ళు – మోర్గాన్, శుభ్‌మాన్‌ గిల్, ప్యాట్ కమ్మిన్స్

రాజస్తాన్ రాయల్స్:

రిటైన్ ప్లేయర్స్: సంజూ శాంసన్(రూ. 14 కోట్లు), జోస్ బట్లర్(రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్(రూ. 4 కోట్లు)

పర్స్‌లో మిగిలిన మనీ – రూ. 48 కోట్లు

రిలీజైన కీలక ఆటగాళ్ళు – జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్