Watch Video: రాత మారదా.. ఫోర్లు, సిక్సర్లు బాదినా.. ఇలా వికెట్ కోల్పోయానేంట్రా బాబు.. కోపంతో కోహ్లీ ఏంచేశాడంటే?

|

May 14, 2022 | 9:23 AM

విరాట్ కోహ్లి ఈ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో మొదటి బంతికి 3 సార్లు ఔట్ కాగా, అతని ఖాతాలో ఇప్పటివరకు కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే రావడం గమనార్హం.

Watch Video: రాత మారదా.. ఫోర్లు, సిక్సర్లు బాదినా.. ఇలా వికెట్ కోల్పోయానేంట్రా బాబు.. కోపంతో కోహ్లీ ఏంచేశాడంటే?
Ipl 2022 Virat Kohli
Follow us on

అదృష్టం కలిసిరానప్పుడు ఎవరైనా సరే ఇబ్బందులు పడాల్సిందే. క్రికెట్ నేపధ్యంలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రపంచ క్రికెట్‌ను దశాబ్దకాలం పాటు అద్భుతంగా, రికార్డులు బద్దలు కొట్టే బ్యాటింగ్‌తో శాసించిన కోహ్లి.. గత 3 ఏళ్లుగా కష్టాల్లో పడ్డాడు. IPL 2022లో, ఈ పోరాటం మొదటి-రెండవ బంతికి కోహ్లీ అవుటయ్యేలా చేస్తోంది. కొన్నిసార్లు అతని బ్యాట్ నుంచి పరుగులు వచ్చినా, ఔట్ కావడానికి కొంత మార్గం రాసుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)పై కూడా ఇలాంటిదే జరిగింది. అక్కడ కోహ్లి గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ మరోసారి బ్యాడ్ లక్ ఎదురైంది.

Also Read: Watch Video: అట్లుంటది మరి ధోనీతో.. దెబ్బకు సిగ్నల్ మార్చేసిన అంపైర్.. వైరల్ వీడియో..

ఐపీఎల్ 2022 సీజన్ విరాట్ కోహ్లీకి పీడకల లాంటిది. RCB మాజీ కెప్టెన్ పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. అతను మూడుసార్లు మొదటి బంతికే ఔట్ అయ్యాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దురదృష్టం ముగిసిపోయినట్లుగా కనిపించింది. కోహ్లీ బ్యాట్‌ నుంచి పరుగులు రావచ్చని అనిపించింది. ఇది జరిగిన కాసేపటికి, చివరికి అతను మంచి రిథమ్‌లోనే పెవిలియన్ చేరాడు.

ఇవి కూడా చదవండి

మంచి ప్రారంభం, చెడు ముగింపు..

పంజాబ్ విధించిన 210 పరుగుల లక్ష్యానికి సమాధానంగా, బెంగళూరు తరపున ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ.. రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్‌పై రెండు అద్భుతమైన ఫోర్లు సాధించాడు. తర్వాత కోహ్లీ ముందుకు వెళ్లి మూడో ఓవర్‌లో వచ్చిన ఎడమచేతి వాటం స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌పై అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ఇప్పటి వరకు కోహ్లి తన పాత స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఈ రోజు అంతా మారిపోతుందని అనిపించింది. కానీ, బహుశా కోహ్లీ అదృష్టం ఈ సమయంలో అంగీకరించలేదనుకుంటా. మరోసారి అదే తీరుతో పెవిలియన్ చేరాడు.

నాలుగో ఓవర్‌లో కగిసో రబాడ వేసిన రెండో బంతి షార్ట్‌గా ఉండటంతో కోహ్లీ దానిని హుక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి అతని నడుముకు తగిలి షార్ట్ ఫైన్ లెగ్ వద్ద క్యాచ్‌కి వెళ్లింది. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అయితే, పంజాబ్ రివ్యూ తీసుకుంది. బంతి అతని గ్లోవ్‌ను తాకినట్లు రీప్లేలో తేలింది.

ఆకాశాన్ని చూస్తూ తిట్టుకుంటూ పెవిలియన్ చేరిన కోహ్లీ..

ఈ సమయానికి కోహ్లి 13 బంతుల్లో 20 పరుగులు చేసి మంచి టైమింగ్‌తో షాట్లు కొడుతున్నాడు. అయితే కొంత అదృష్టం అవసరం కాగా, ప్రస్తుతానికి అక్కడి పరిస్థితి మారలేదు. ఇలా ఔట్ అయ్యానన్న కోపం కోహ్లి ముఖంలో స్పష్టంగా కనిపించింది. పెవిలియన్‌కు వస్తుండగా ఆకాశం వైపు చూస్తూ తన కోపాన్ని వెళ్లగక్కాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోహ్లి 13 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే చాలా నెమ్మదిగా ఆడిన అతని బ్యాట్ నుంచి కేవలం 1 అర్ధ సెంచరీ మాత్రమే వచ్చింది. ఈ 13 ఇన్నింగ్స్‌లలో ఇప్పటివరకు 236 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని సగటు 19, స్ట్రైక్ రేట్ 113గానే ఉంది.

Also Read: Cricket: 20 బంతుల్లో 102 పరుగులు.. బౌండరీలతో బౌలర్ల ఊచకోత.. కోహ్లీకి మరోసారి షాకే!

IPL 2022: డెత్ ఓవర్లలో వీరు యమా డేంజర్.. బౌలర్లపై ఊచకోతకు కేరాఫ్ అడ్రస్.. రికార్డులు చూస్తే అవాక్కే..