IPL 2022: ఐపీఎల్ 2022 (IPL 2022 Mega Auction) మెగా వేలానికి ముందు, రెండు కొత్త జట్లలో ఒకటైన లక్నో టీం రవి బిష్ణోయ్(Ravi Bishnoi), మార్కస్ స్టోయినిస్‌లపై కన్నేసినట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్(KL Rahul) ఇప్పటికే ఆ జట్టులో చేరడం దాదాపు ఖరారైంది. లక్నో తన రిటైన్ చేసిన ముగ్గురు ఆటగాళ్ల గురించి జనవరి 22 నాటికి సమాచారం ఇవ్వాలి. కేఎల్ రాహుల్‌తో పాటు రషీద్ ఖాన్‌ను లక్నో ఫ్రాంచైజీ తీసుకోవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, రషీద్ ఖాన్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు లక్నో, అహ్మదాబాద్ కొత్త జట్లకు బీసీసీఐ ఇటీవలే అధికారికంగా అనుమతి ఇచ్చింది. దీనితో పాటు, జనవరి 22 లోగా రిటైన్ చేసిన ఆటగాళ్ల గురించి సమాచారం ఇవ్వాలని కోరింది.
లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌తో పాటు రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్‌లను తీసుకోవచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియాతో జర్నలిస్ట్ కె. శ్రీనివాస్ రావు తెలియజేశారు. ఈ చర్య మెగా వేలానికి ముందు జట్టు డబ్బును ఆదా చేస్తుందని తెలుస్తోంది. రవి బిష్ణోయ్ ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్. అంటే, అతను ఇంకా భారతదేశం తరపున ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. IPL 2022 మెగా వేలానికి ముందు నిలుపుదల నిబంధనల ప్రకారం, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రూ. 4 కోట్ల వరకు మాత్రమే ఇవ్వాలని కండీషన్ ఉంది.
బిష్ణోయ్ పంజాబ్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. ఈ కోణంలో, లక్నో తక్కువ మొత్తానికి మంచి ఆటగాడిని పొందనుంది. మరోవైపు, యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కెరీర్ ప్రారంభంలో నిలుపుదల హామీని పొందనున్నాడు. అలాగే కేఎల్ రాహుల్, ఆండీ ఫ్లవర్‌లతో కలిసి మళ్లీ ఆడే అవకాశం దక్కనుంది. అతను ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడాడు. రాహుల్ పంజాబ్ కెప్టెన్‌గా ఉండగా, ఫ్లవర్ ఈ జట్టుకు సహాయ కోచ్‌గా ఉన్నారు. రవి బిష్ణోయ్ 2020 అండర్ 19 ప్రపంచకప్ నుంచి వెలుగులోకి వచ్చాడు. ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే ఐపీఎల్‌లో రెండు సీజన్లలో అతని ప్రదర్శన ఆకట్టుకుంది.
మార్కస్ స్టోయినిస్..
మార్కస్ స్టోయినిస్‌తో కలిసి లక్నో వెళ్లడం కాస్త షాకింగ్ నిర్ణయం. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. కానీ, ఇక్కడ అతని ప్రదర్శన ప్రత్యేకంగా లేదు. అతను IPL 2020 నుంచి ఢిల్లీలో చేరాడు. ఈ సమయంలో, అతను 2020లో 17 మ్యాచ్‌లలో 25.14 సగటుతో 353 పరుగులు, 13 వికెట్లు సాధించాడు. అదే సమయంలో, 2021లో అతను 10 మ్యాచ్‌లలో 89 పరుగులు, రెండు వికెట్లు మాత్రమే తీశాడు. రూ. 4.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
మెంటార్‌గా గౌతమ్ గంభీర్, ప్రధాన కోచ్‌గా ఆండీ ఫ్లవర్, అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దహియా నియమితులైనట్లు లక్నో టీమ్ ప్రకటించింది.
Okay… lunch break so let me quickly share an IPL update.
Ravi Bishnoi & Marcus Stoinis could join KL Rahul at Lucknow.
I’m a bit surprised they didn’t push for Chahal or Rashid. But considering Bishnoi is uncapped, it’s understandable.
They save money ahead of the auction.
— KSR (@KShriniwasRao) January 13, 2022
IND vs SA: కేప్ టౌన్‌లో అదరగొట్టిన రిషబ్ పంత్.. సెంచరీతో కీలక ఇన్నింగ్స్..!