ఐపీఎల్ 2022(IPL 2022) తుది దశకు చేరుకుంది. దీంతో ఆరెంజ్ క్యాప్(Orange Cap) ఎవరు గెలుచుకుంటారో ఆసక్తి నెలకొంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్(DC) తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానంలోకి చేరుకున్నాడు. మొదటి స్థానంలో జోస్ బట్లర్ ఉండగా.. కేఎల్ రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే వీరిద్దరు 12 మ్యాచ్‌లు ఆడగా.. వార్నర్ 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వార్నర్ రాహుల్‌కు దగ్గరగా ఉన్నా.. బట్లర్‌కు మాత్రం 198 పరుగుల దూరంలో ఉన్నాడు. వార్నర్‌కు ఆరెంజ్ క్యాప్ రావాలంటే.. బట్లర్ మిగతా మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులు చేస్తేనే సాధ్యం అయ్యే అవకాశం ఉంది.
వార్నర్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థసెంచరీ చేశాడు. రాజస్థాన్‌పై 41 బంతుల్లో 52 పరుగుల అజేయంగా నిలిచాడు. డేవిడ్ వార్నర్ IPL 2022లో రాజస్థాన్‌పై అజేయంగా 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత 400 ప్లస్ పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 8వ సారి 400 ప్లస్ పరుగులు సాధించాడు. అంతకుముందు అతను 2013 నుంచి 2017 వరకు నిరంతరంగా పరుగులు చేశాడు. ఆ తర్వాత 2019, 2020లో కూడా 400+ పరుగులు చేశాడు. ఇప్పుడు 2022లో కూడా మరోసారి ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతను 2016 సీజన్‌లో ఏకంగా 973 పరుగులు చేశాడు. బట్లర్.. కోహ్లీ రికార్డును దాటాలంటే 346 పరుగులు చేయాలి. ఒకవేళ రాజస్థాన్ ప్లేఆఫ్‌కు వెళ్తే.. బట్లర్‌కు రెండు లేదా మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
Read Also.. IPL 2022: సజీవంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ ఆశలు.. రాజస్థాన్‌పై విజయంతో 5వ స్థానానికి పంత్ సేన..