ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ప్రదర్శన ఎంతగానో నిరాశపరిచింది. బుధవారం (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టును పంజాబ్ కింగ్స్ (PBKS) 12 పరుగుల తేడాతో ఓడించింది. వరుసగా ఐదో ఓటమి కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 24 లక్షల జరిమానా విధించగా, మిగిలిన ప్లేయింగ్ ఎలెవన్ జట్టుకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా విధించారు. నిర్ణీత సమయంలోగా 20 ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో రోహిత్ శర్మ జట్టు విఫలమైంది. అంతకుముందు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ తర్వాత స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
రోహిత్‌పై వేటు పడనుందా..
ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ రాబోయే మ్యాచ్‌లలో నిర్ణీత సమయంలో ఓవర్‌లను ముగించాలి. లేకుంటే దాని భారాన్ని ఆటగాళ్లతోపాటు సారథి కూడా భరించాల్సి ఉంటుంది. ముంబయి మూడోసారి ఆ నేరాన్ని పునరావృతం చేస్తే రోహిత్‌కు రూ.30 లక్షల జరిమానా విధిస్తారు. దీంతో పాటు ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించనున్నారు.
నియమం ఏం చెబుతుంది?
మినిమమ్ ఓవర్ రేట్ నియమం ప్రకారం, “ఒక సీజన్‌లో మూడోసారి ఇలాచేస్తే, బౌలింగ్ జట్టు కెప్టెన్‌కి రూ. 30 లక్షల జరిమానా విధించాలి. అతను జట్టు తదుపరి లీగ్ మ్యాచ్‌లో ఆడకుండా నిషేధం విధించాలి.” నిషేధం ఎదుర్కొన్న తర్వాత కూడా ఆ సీజన్‌లో జట్టు మళ్లీ మూడు పర్యాయాలు స్లో ఓవర్లకు పాల్పడితే, కెప్టెన్ మళ్లీ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఆరో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్ (LSG)తో ఏప్రిల్ 16న తలపడనుంది. ముంబైలోని చారిత్రాత్మక బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read: IPL 2022: మెరిసిన హార్దిక్ పాండ్యా.. 37 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ గెలుపు..
IPL 2022: విజృంభించిన హార్దిక్ పాండ్యా.. 192 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్..