IPL 2022: ధోని మాటలు విన్నాడు.. ఇప్పుడు హీరోగా మారాడు. నిన్న సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ధోనీ చెప్పిన ప్రతి విషయాన్ని అమలు చేశాడు. దానికి ప్రతిఫలం పొందాడు. జట్టు విజయానికి కారణమయ్యాడు. ఇప్పుడు ఈ ఆటగాడు ఎవరని మీరు ఆలోచిస్తూ ఉండాలి. అతడి పేరు ముఖేష్ చౌదరి. నిన్నటి మ్యాచ్‌లో 4 వికెట్లు సాధించి అందరి దృష్టి తనవైపు మళ్లించుకున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముఖేష్ చౌదరి 4 ఓవర్లలో 4 వికెట్లు
25 ఏళ్ల ముఖేష్ చౌదరి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్ వికెట్లని సాధించాడు. 4 ఓవర్ల బౌలింగ్‌లో ముఖేష్ చౌదరి ఒక్క నోబాల్ కూడా వేయలేదు. అంతేకాదు 9 బంతులు డాట్ బౌలింగ్ చేశాడు. వాస్తవానికి ధోనీ ముఖేష్ చౌదరికి పెద్దగా ఏం చెప్పలేదు ” బంతిని లైన్ అండ్ లెన్త్‌లో వేయి.. నో బాల్ అస్సలు వేయవద్దని సూచించాడు” ముఖేష్ చౌదరి అతడు చెప్పినట్లు పాటించాడు. విజయం సాధించాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి