IPL 2022 Mega Auction: మెగా వేలంలో వీరికి మొండిచెయ్యి.. ఫ్రాంఛైజీలు పక్కనపెట్టే భారత ఆటగాళ్లేవరంటే?

|

Dec 07, 2021 | 11:48 AM

IPL 2022: ఇటీవల ఫ్రాంఛైజీలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని పెద్ద పేర్లను తమ లిస్టు నుంచి తప్పించాయి. కొద్దిమందినే రిటైన్ చేసుకుని, మిగతా వారిని విడుదల చేశాయి.

IPL 2022 Mega Auction: మెగా వేలంలో వీరికి మొండిచెయ్యి.. ఫ్రాంఛైజీలు పక్కనపెట్టే భారత ఆటగాళ్లేవరంటే?
Ipl 2022 Retention Live Streaming
Follow us on

IPL 2022 Mega Auction: రిటైన్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం క్రికెట ఫ్యాన్స్‌తో పాటు ఫ్రాంఛైజీల చూపు చాలాకాలంగా ఎదురుచూస్తున్న మెగా-వేలం వైపు మళ్లింది. మెగా-వేలం జనవరి 2022 తొలి భాగంలో జరగనుంది. అన్ని జట్లూ క్లీన్ స్లేట్ నుంచి కొత్తగా ప్రారంభించాలని చూస్తుండడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. రెండు కొత్త జట్ల చేరికతో, కొత్త ఫ్రాంచైజీలు జట్టును నిర్మించాలని చూస్తున్నందున మెగా వేలం భారీగానే జరగబోతోంది. ఇటీవలే రిటెన్షన్‌లో, ఫ్రాంఛైజీలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని పెద్ద పేర్లను తప్పించాయి. అంటే కొద్ది మందిని మాత్రమే రిటైన్ చేసుకుని, మిగతా వారిని విడుదల చేశాయి. వీరంతా మెగా వేలంలో కనిపంచనున్నారు.

అయితే ఆసారి వేలంపాటలో అన్ని జట్లు తమ భవిష్యత్తు ఆటగాళ్లను తయారు చేయడంలో నిమగ్నమై ఉంటాయని తెలుస్తోంది. అందుకే ఎక్కువమంది యంగ్ ప్లేయర్ల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో ఈ సారి భారత స్టార్ ప్లేయర్లకు మొండిచేయి ఎదురుకానుందని తెలుస్తోంది. మెగా వేలంలో సెలక్ట్ కాని కొంతమంది ప్లేయర్లను ఇప్పుడు చూద్దాం.

సురేశ్ రైనా: ‘మిస్టర్ ఐపీఎల్’గా మారి లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రైనా ఒకడు. కానీ, వ్యక్తిగత సమస్యల కారణంగా 2020 సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. ఆపై 2021 ఎడిషన్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో CSKకి వేరే మార్గం లేక, విడుదల చేసింది. అతని ఫామ్, వయస్సు దృష్ట్యా రైనాకు ఐపీఎల్ 2022లో ఛాన్స్ దొరికే అవకాశం లేదు.

అంబటి రాయుడు: CSK స్టార్ ప్లేయర్, 2021 ఎడిషన్‌లో పేలవ ఫామ్ కారణంగా రిటైన్ చేసుకోలేదు. రాయుడు అనుభవజ్ఞుడైన క్రికెటర్. కానీ, అతని ఫిట్‌నెస్, వయస్సు మేరకు రాబోయే మెగా వేలంలో నిరాశే ఎదురుకానుంది.

హర్భజన్ సింగ్: గత వేలంలో కేకేఆర్ తరపున బరిలోకి దిగిన హర్భజన్.. చాలా మ్యాచులో ఆడనేలేదు. అతని వయస్సు, ఫిట్‌నెస్ కారణంగా ఈ స్టార్ ప్లేయర్ కూడా సింగిల్‌గానే మిగిలిపోనున్నాడు.

దినేష్ కార్తీక్: రెండు పేలవమైన సీజన్ల నేపథ్యంలో మాజీ కేకేఆర్ కెప్టెన్‌ను ఫ్రాంచైజీ విడుదల చేసింది. నిలకడగా లేమి ప్రదర్శనతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో క్రమం తప్పకుండా ఆడనందున ఫ్రాంచైజీలు దినేష్ కార్తీక్ వైపు చూడవని తెలుస్తోంది.

Also Read: IND vs SA: టెస్ట్ కెప్టెన్సీలో ఆయనే నంబర్ వన్.. అక్కడ సిరీస్ గెలిస్తే చరిత్రలో నిలుస్తాడు: టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్

IND vs NZ: ‎ఆయన లేకుంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌కు ఘోర పరాజయాలు తప్పవు: కివీస్ మాజీ కోచ్