IPL 2022: అరంగేట్రంలోనే అదరగొట్టిన జూనియర్‌ మలింగ.. మొదటి బంతికే గిల్‌ను ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..

|

May 16, 2022 | 2:11 PM

IPL 2022: జూనియర్‌ మలింగగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్‌ ఆటగాడు నిన్న ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.1 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

IPL 2022: అరంగేట్రంలోనే అదరగొట్టిన జూనియర్‌ మలింగ.. మొదటి బంతికే గిల్‌ను ఎలా బోల్తా కొట్టించాడో చూడండి..
Matheesha Pathirana
Follow us on

IPL 2022: లసిత్‌ మలింగ.. క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. తన స్లింగ్‌ యాక్షన్‌ బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడీ లంక బౌలర్‌. ప్రస్తుతం ఐపీఎలోలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో మలింగ లేని లోటును తీర్చేందుకు ఆ దేశం నుంచే మరో యంగ్ బౌలర్ వచ్చాడు. అచ్చం మలింగ లాగే వైవిధ్యమైన యాక్షన్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు అతనే శ్రీలంక యువ పేసర్‌ మతీషా పతిరనా (Matheesha Pathirana) . జూనియర్‌ మలింగగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్‌ ఆటగాడు నిన్న ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.1 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా పతిరనా బౌలింగ్‌ ఫ్యా్న్స్‌ని ఆకట్టుకుంది.

కాగా ఈ మ్యాచ్‌లో తను వేసిన తొలి బంతికే వికెట్‌ సాధించాడు మతీషా. గుజరాత్‌ స్టార్ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మెరుపు వేగంతో దూసుకొచ్చిన బంతికి గిల్‌ వద్ద సమాధానమే లేకపోయింది. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 19 ఏళ్ల వయసున్న మతీషాను రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై ఫ్రాంఛైజీ. అయితే 12 మ్యాచ్‌ల తర్వాత గానీ అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఆడమ్ మిల్నే గాయం కారణంగా దూరమవ్వడంతో చెన్నై పతిరాణాను జట్టులోకి తీసుకుంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ 53 పరుగులతో రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ రెండు, రషీద్‌ ఖాన్‌, జోషెఫ్‌, సాయి కిషోర్‌ తలా వికెట్‌ తీశారు. ఇక 134 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. వృద్ధిమాన్ సాహా(67) పరుగులతో రాణించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Photo: సర్కారు వారి పాట సినిమా చూసేందుకు సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన ఈ స్టార్‌ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

AP BJP: వ్యక్తిగత కారణాలతో.. బీజేపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గుడ్ బై..

Andhra Pradesh: ఆ సమస్యపై దత్తపుత్రుడు అప్పుడెందుకు మాట్లాడలేదు.. సీఎం జగన్ సూటి ప్రశ్న