IPL-2022: ఐపీఎల్-2022లో పాల్గొనబోయే లక్నో జట్టు పేరు ఖరారైంది.. ఏం పేరు పెట్టారో తెలుసా..

|

Jan 24, 2022 | 8:35 PM

ఐపీఎల్-2022(IPL-2022)లో కొత్తగా రెండు జట్లు పాల్గొనబోతున్నాయన్న విషయం అందరికి తెలింసిందే. రెండు జట్లలో ఒకటి ఆహ్మదబాద్ జట్టు కాగా మరొకటి లక్నో జట్టు...

IPL-2022: ఐపీఎల్-2022లో పాల్గొనబోయే లక్నో జట్టు పేరు ఖరారైంది.. ఏం పేరు పెట్టారో తెలుసా..
Locknow1 (1)
Follow us on

ఐపీఎల్-2022(IPL-2022)లో కొత్తగా రెండు జట్లు పాల్గొనబోతున్నాయన్న విషయం అందరికి తెలింసిందే. రెండు జట్లలో ఒకటి ఆహ్మదబాద్ జట్టు కాగా మరొకటి లక్నో జట్టు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఉన్న లక్నో తన జట్టు పేరును ప్రకటించింది. జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్​గా(lucknow super giants ) నామకరణం చేసింది. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా(Sanjiv goenka) ఈ విషయాన్ని ట్విటర్‌లో ప్రకటించారు. అభిమానుల నుంచి వచ్చిన సూచనల మేరకే జట్టుకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ అని పేరు పెట్టినట్లు సంజీవ్‌ గోయెంకా తెలిపారు. లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా 2017లో పూణే సూపర్‌జెయింట్స్‌గా పేరు పొందిన IPL జట్టును కొనుగోలు చేశారు. ఈ జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్‌గా ఉన్నాడు. 2018 లో ఆ జట్టు ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్​ కేఎల్ రాహుల్​ను రూ. 17 కోట్లు, స్టోయినిస్ రూ. 9.5 కోట్లు, రవి బిష్ణోయ్ రూ. 4కోట్లుకు తీసుకోగా.. లక్ననో వద్ద ఇంకా రూ.60 కోట్ల నగదు మిగిలి ఉంది. ఆ జట్టు త్వరలో జరిగే ఐపీఎల్-2022 మెగా వేలంలో మిగతా ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. లక్నో టీంకు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మెంటర్​గా వ్యవహరిస్తున్నాడు.

Read Also.. Virat Kohli: పాకిస్తాన్ చేసిన తప్పునే భారత్ చేస్తోంది.. కోహ్లీ విషయంలో అదే జరిగిందంటున్న పాక్ మాజీ కెప్టెన్..