
IPL 2022 KKR vs SRH Score: హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అదరగొట్టాడు. 28 బంతుల్లో 49 పరుగులు చేసి చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతనితో పాటు సామ్ బిల్లింగ్స్ (34) రాణించడతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రేయస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. రహానె (28), నితీశ్ రాణా (26) పర్వాలేదనిపించారు. వీరు తప్ప మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో కేకేఆర్ భారీస్కోరు చేయలేకపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. వెంకటేశ్ అయ్యర్ (7) మార్కొ జాన్సెన్ బౌలింగ్‌లో త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత అజింక్యా రహానే, నితీశ్ రాణ నింపాదిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (15) మరోసారి నిరాశపర్చినా సామ్ బిల్లింగ్స్ జట్టును ఆదుకున్నాడు. ఇక ఎప్పటిలాగే ఆఖర్లో ఆండ్రీ రస్సెల్ మెరుపులు మెరిపించాడు. 28 బంతుల్లో 49 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.
అదరగొట్టిన మాలిక్..
ఇక హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ (33/3) మళ్లీ అదరగొట్టాడు. భువనేశ్వర్ (27/1), జాన్సన్ (30/1), నటరాజన్ (43/1) పర్వాలేదనిపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: