మిస్టర్ ఐపీఎల్‌గా ప్రసిద్ధి గాంచిన సురేశ్ రైనా(Suresh Raina) ఈ ఏడాది వేలంలో అమ్ముడుకాలేదని తెలిసిందే. గత సీజన్‌లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీం కూడా అతనిని నిలబెట్టుకోకపోవడంతో సురేశ్ రైనా.. మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఈ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా సురేశ్ రైనాను తీసుకోవడానికి ఇష్టపడలేదు. వేలం తర్వాత, కొంతమంది ఆటగాళ్లు.. టోర్నమెంట్ నుంచి తమ పేర్లను ఉపసంహరించున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒక జట్టు ఈ ఆటగాడిని తమ శిబిరంలోకి తీసుకుంటుందని అంతా భావించారు. కానీ, అది కూడా జరగలేదు. ప్రస్తుతం సురేష్ రైనా ఐపీఎల్ 2022(IPL 2022)లో ఆటగాడిగా కాకుండా భారత మాజీ కోచ్ రవిశాస్త్రితో కలిసి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు.
నివేదికల ప్రకారం, సురేశ్ రైనా, రవిశాస్త్రి IPL 2022 హిందీ కామెంటేటర్లుగా ఉండనున్నారు. గత సీజన్ వరకు బ్యాట్‌తో అలరించిన ఈ మిస్టర్ ఐపీఎల్.. ఈ ఏడాది తన గాత్రంతో అభిమానులను అలరించనున్నాడు.
సురేశ్ రైనా ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లలో 5528 పరుగులు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ జట్ల తరపున ఆడాడు. రైనాను ‘చిన్న తలా’ అని కూడా అంటారు.
మరోవైపు, రవిశాస్త్రి గురించి మాట్లాడితే.. 2017 తర్వాత మొదటిసారి కామెంటేటర్‌గా కనిపించాడు. 2007, 2011 ప్రపంచకప్‌ల విజయ క్షణాలపై తన గాత్రాన్ని అందించిన శాస్త్రి.. 2021 ప్రపంచకప్ తర్వాత తన పదవీకాలం ముగిసింది. అతని ఆధ్వర్యంలో భారత్ ఐసీసీ టైటిల్‌ను గెలవలేకపోయింది. కానీ, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం చాలా ఆకట్టుకునే ఫలితాలు సాధించాడు. నివేదిక ప్రకారం, శాస్త్రి ఈసారి మాత్రమే హిందీ వ్యాఖ్యాన బృందంలో భాగం అవ్వనున్నాడు.
ఐపీఎల్ 2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్ డిఫెండింగ్ విన్నర్స్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. సీజన్ 15 చివరి మ్యాచ్ మే 29న జరుగుతుంది.
IPL 2022: కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే జట్లు ఇవే.. తొలిసారిగా బాధ్యతలు చేపట్టనున్న ఆ ఇద్దరు..