IPL 2022: ధోనీ టీంలో పెరిగిన టెన్షన్.. వీసా దొరకక దూరమైన చెన్నై ఆల్ రౌండర్?

టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కే శిబిరంలో టెన్షన్ బాగా పెరిగింది.

IPL 2022: ధోనీ టీంలో పెరిగిన టెన్షన్.. వీసా దొరకక దూరమైన చెన్నై ఆల్ రౌండర్?
Ipl 2022 Chennai Super Kings Team

Updated on: Mar 20, 2022 | 2:58 PM

ఐపీఎల్ 15వ సీజన్(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కే శిబిరంలో టెన్షన్ బాగా పెరిగింది. నిజానికి, స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ(Moeen Ali)కి గత 20 రోజులుగా భారత్‌కు రావడానికి వీసా లభించలేకపోవడంతో ఈ టెన్షన్ మరింత పెరిగింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం , మొయిన్ అలీ వీసా కోసం ఫిబ్రవరి 28న దరఖాస్తు చేసుకున్నట్లు చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు. దరఖాస్తు చేసి 20 రోజులైంది. అతను నిరంతరం భారతదేశానికి వస్తూ ఉంటాడు. దీని తర్వాత కూడా అతనికి ప్రయాణానికి అనుమతి లభించలేదు. అతను త్వరలో జట్టులోకి వస్తాడని మేం ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.

‘పేపర్లు దొరికిన తర్వాత తదుపరి విమానంలో బయలుదేరతానని మొయిన్ అలీ మాకు చెప్పారు. మాకు సహాయం చేసేందుకు బీసీసీఐ కూడా ఈ విషయంలో పాలుపంచుకుంది. మార్చి 21, సోమవారం నాటికి వారు పత్రాలను పొందుతారని మేం ఆశిస్తున్నాం’ అని వారు తెలిపారు.

రూ. 8 కోట్లకు దక్కించుకున్న చెన్నై..

మొయిన్ అలీ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గత ఏడాది చెన్నైకి నాలుగో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచుల్లో 357 పరుగులు చేయడమే కాకుండా 6 వికెట్లు తీశాడు. IPL 2022 కోసం కూడా ఫ్రాంచైజీ అతనిని రూ.8 కోట్లకు తన వద్ద ఉంచుకోవడానికి ఇదే కారణం. ఐపీఎల్‌లో మొత్తం 15 మ్యాచుల్లో 666 పరుగులతో పాటు 16 వికెట్లు తీశాడు.

సీఎస్‌కే శిక్షణా శిబిరం సూరత్‌లో ఏర్పాటు..

చెన్నై సూపర్ కింగ్స్ తన శిక్షణా శిబిరాన్ని సూరత్‌లో ఏర్పాటు చేసింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా జట్టు ఆటగాళ్లు చెమటలు పట్టిస్తున్నారు. చెన్నై 4 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈసారి కూడా మరో ట్రోఫీపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Also Read: IPL 2022: క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు?

IPL 2022: మార్క్ వుడ్ స్థానంలో లక్నో జట్టులో చేరేది వీరే.. లిస్టులో మిస్టర్ ఐపీఎల్?