IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్ కోసం మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. సాధ్యమైనంత బలమైన జట్టును తయారుచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు తోడు రెండు కొత్త ఫ్రాంచైజీలు — లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ కూడా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనబోతున్నాయి. మెగా వేలానికి ముందు, రెండుసార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లతో పాటు వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్‌లను రిటైన్ చేసుకుంది. రూ. 48 కోట్ల పర్స్‌తో మెగా వేలంలోకి అడుగుపెట్టనున్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా..
ఆండ్రీ రస్సెల్ (రూ. 12 కోట్లు)
వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు)
వెంకటేష్ అయ్యర్ (రూ. 8 కోట్లు)
సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు)
ఐపీఎల్ 2022 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఎంచుకునేందుకు ప్లాన్ చేసిన ఆటగాళ్లు:
1. డేవిడ్ వార్నర్ (గరిష్టంగా రూ. 5 కోట్లు)
కేకేఆర్ లిస్టులో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ కేకేఆర్‌కు విజయం సాధించే నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. వార్నర్ 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను IPL టైటిల్‌కు మార్గనిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ ఇద్దరూ ఫ్రాంచైజీ ద్వారా విడుదలైన తర్వాత కేకేఆర్‌ని నడిపించడానికి వార్నర్ సరైన వ్యక్తి అని నిరూపించుకుంటాడనడంలో సందేహం లేదు.
2. శ్రేయాస్ అయ్యర్ (గరిష్టంగా రూ. 7 కోట్లు)
వార్నర్‌తో పాటు, శ్రేయాస్ అయ్యర్ వేలానికి ముందు దాదాపు ప్రతి జట్టు లిస్టులో ఉంటాడనడంలో సందేహం లేదు. శ్రేయాస్ బ్యాట్‌తో అద్భుత ఇన్నింగ్స్‌లతో పాటు, 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు నడిపించి గొప్ప నాయకుడిగా కూడా నిలిచాడు.
3. లాకీ ఫెర్గూసన్ (గరిష్టంగా రూ. 5 కోట్లు)
IPL చివరి రెండు సీజన్లలో లాకీ ఫెర్గూసన్ కేకేఆర్ తరపున ఎక్కువగా ఆడలేదు. గాయాలతోపాటు పాట్ కమిన్స్ కారణంగాతన సత్తా చూపే అవకాశం రాలేదు. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా ఫెర్గూసన్ ఆకట్టుకోవడంలో విఫలం కాలేదు. అందుకే కేకేఆర్‌ని తిరిగి సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది.
4. దేవదత్ పడిక్కల్ (గరిష్టంగా రూ. 4 కోట్లు)
కేకేఆర్ నుంచి శుభమాన్ గిల్ విడుదలవ్వడంతో దేవదత్ పడిక్కల్ కూడా ఆర్‌సీబీ నుంచి బయటకు వచ్చాడు. గిల్‌ను గుజరాత్ లయన్స్ డ్రాఫ్ట్ చేసినందున, శుభమాన్ స్థానంలో పడిక్కల్ ఆకట్టుకుంటాడని ఆశిస్తోంది.
5. షేక్ రషీద్ (గరిష్టంగా రూ. 75 లక్షలు)
టీమిండియా 2022 U19 ప్రపంచ కప్ జట్టు వైస్-కెప్టెన్, షేక్ రషీద్ టోర్నమెంట్‌లో జట్టుకు మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా, కేకేఆర్ టీం మిడిల్-ఆర్డర్‌లో స్థిరత్వాన్ని కనుగొనడంలో కష్టపడుతోంది. ఇటీవల U19 ప్రపంచ కప్‌లో ఈ ఆటగాడి ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని చూస్తోంది.