IPL 2022 Auction: తనను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోదు.. శ్రేయాస్ అయ్యర్‌ను కూడా అంతే..

|

Nov 23, 2021 | 11:57 AM

IPL 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మేనేజ్‌మెంట్ తనను రిటైన్ చేయడం లేదని భారత ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. తాను మాత్రమే కాదు, శ్రేయాస్ అయ్యర్‌ను కూడా డీసీ టీమ్ రిటైన్ చేయదని పేర్కొన్నాడు...

IPL 2022 Auction: తనను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోదు.. శ్రేయాస్ అయ్యర్‌ను కూడా అంతే..
Ashwin
Follow us on

IPL 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మేనేజ్‌మెంట్ తనను రిటైన్ చేయడం లేదని భారత ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. తాను మాత్రమే కాదు, శ్రేయాస్ అయ్యర్‌ను కూడా డీసీ టీమ్ రిటైన్ చేయదని పేర్కొన్నాడు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ప్రకటన చేశాడు. ” నేను ఢిల్లీలో రిటైన్ కావడం లేదు, ఢిల్లీ మేనేజ్‌మెంట్ నన్ను రిటైన్ చేసి ఉంటే నాకు ఈపాటికి తెలిసి ఉండేది” అని అశ్విన్ చెప్పాడు.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) విడుదల చేసిన రిటెన్షన్ పాలసీ ప్రకారం ఫ్రాంచైజీలు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. అశ్విన్ డీసీ తనని, అయ్యర్‌ను ఉంచుకోలేడని భావించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు కంటే ఎక్కువ ఆటగాళ్లను కలిగి ఉండదని తాను భావిస్తున్నానని అశ్విన్ చెప్పాడు. రిషబ్ పంత్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జ్ జట్టులో ఉండాలన్నాడు. IPL 2020లో పంజాబ్ కింగ్స్ నుండి 7.6 కోట్లతో అశ్విన్‎ను ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. అశ్విన్ ఫ్రాంచైజీతో సూపర్-విజయం సాధించాడు. IPL 2020, IPL 2021లో చక్కటి ప్రదర్శన చేశారు. ఐపీఎల్ 2020లో 15 మ్యాచ్‎లు ఆడిన అశ్విన్ 7.61 ఎకనమితో 13 వికెట్లు తీశాడు. 2021 ఐపీఎల్‎లో 13 మ్యాచ్‎ల్లో 7.46 ఎకనమితో 7 వికెట్లు పడగొట్టాడు.

IPL 2022: రిటైన్ నిబంధనలు

  • మొత్తం ఆటగాళ్ల పర్స్: ₹90 కోట్లు
  • నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. రూ.42 కోట్లు తీసేస్తారు.
  • 3 నిలుపుకుంటే రూ. 33 కోట్లు తీసేస్తారు.
  • 2 నిలుపుకుంటే పర్స్ నుండి రూ. 24 కోట్లు తగ్గిస్తారు.
  • 1 నిలుపుకుంటే రూ.14 కోట్లు తీసేస్తారు.
  • ప్రస్తుతం ఉన్న జట్లు ముగ్గురు కంటే ఎక్కువ మంది భారతీయులను ఉంచుకోలేవు.
  • ఇప్పటికే ఉన్న జట్లు గరిష్ఠంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను ఉంచుకోగలవు.

Read Also.. LIC Policy: ఎల్‌ఐసీలో అద్భుమైన పాలసీ.. ఒకేసారి డబ్బు డిపాజిట్‌ చేయండి.. ప్రతినెల రూ.20వేల పెన్షన్‌ పొందండి..!