IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. మ్యాచ్‌లు చూడడానికి స్టేడియానికి వెళ్లొచ్చు.. కానీ..

|

Mar 03, 2022 | 9:08 AM

ఐపీఎల్ అభిమానులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మ్యాచ్‌లను స్టేడియాని వెళ్లి మ్యాచ్‌ చూడాలనుకునే వారికి అనుమతి ఇవ్వనుంది...

IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. మ్యాచ్‌లు చూడడానికి స్టేడియానికి వెళ్లొచ్చు.. కానీ..
Ipl 2022
Follow us on

ఐపీఎల్ అభిమానులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మ్యాచ్‌లను స్టేడియాని వెళ్లి మ్యాచ్‌ చూడాలనుకునే వారికి అనుమతి ఇవ్వనుంది. అయితే పూర్తిస్థాయిలో కాకుండా 25 శాతం మందిని మాత్రమే స్టేడియానికి అనుమతి ఇవ్వనున్నారు. ఐపీఎల్ 2022(IPL 2022) మార్చి 26న ప్రారంభం కానుంది. బుధవారం మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే(Aditya takre), మరో మంత్రి ఏక్‌నాథ్ షిండే టోర్నమెంట్ ఏర్పాట్లకు సంబంధించి బీసీసీఐ(BCCI) తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమిన్, ముంబై క్రికెట్ అసోసియేషన్ ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. మలబార్‌ హిల్‌లోని సహ్యాద్రి అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది.

IPL 2022 లీగ్ దశ కోసం BCCI ముంబైలో ఐదు ప్రాక్టీస్ వేదికలను గుర్తించింది. BKCలోని MCA గ్రౌండ్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని బ్రబౌర్న్ స్టేడియం, DY పాటిల్ స్టేడియం, నవీ ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్, MCA గ్రౌండ్. మార్చి 26న వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈసారి లీగ్‌లో 12 డబుల్‌హెడర్లు ఉంటాయి.

టీమ్‌లు మార్చి 8 నాటికి ముంబైకి చేరుకునే అవకాశం ఉంది. మూడు నుండి ఐదు రోజుల క్వారంటైన్ వ్యవధి తర్వాత, మార్చి 14 లేదా 15 నుంచి ప్రాక్టీస్ ప్రారంభమవుతుంది. IPL బయో-సెక్యూర్ ప్రోటోకాల్స్‌లో భాగంగా, బబుల్‌లో భాగమయ్యే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు, వ్యాఖ్యాతలు, ప్రసార సిబ్బంది 3-5 రోజుల వరకు నిర్బంధంలో ఉండాలి.

Read Also.. Shreyas Iyer: టీ20 ర్యాకింగ్స్‌ టాప్ 20లోకి శ్రేయాస్ అయ్యర్.. టాప్ 10లో స్థానం కోల్పోయిన విరాట్ కోహ్లీ..