Covid-19 positive: కరోనా మహారాష్ట్రాలోని ప్రముఖులను వెంటాడుతోంది. బాలీవుడ్‌తోపాటు క్రికెటర్లను కూడా వదలడం లేదు. తాజాగా టీమిండియా మాజీ వికెట్‌కీపర్ ముంబై ఇండియన్స్ వికెట్ కీపింగ్ కన్సల్టంట్ కిరణ్ మోరె కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని ముంబై ఇండియన్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం కిరణ్ మోరెకు ఎలాంటి లక్షణాలు లేవని.. నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు తరలించామని వెల్లడించింది. అతనితోపాటు సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నట్లుగా తెలిపింది. అయితే కిరణ్ మోరె కోచింగ్ టీమ్‌లో లేనందున జట్టు సభ్యులకు భయం లేదని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశిచింన కోవిడ్ రూల్స్‌తోపాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) రూపొందించిన ఆంక్షలు, నిబంధనలను తాము కఠినంగా అమలు చేస్తున్నామని ముంబై ఇండియన్స్ వెల్లడించింది.
కిరణ్ మోరె ఆరోగ్యాన్ని తమ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తోందని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలని కోరింది. మోరె ముంబై ఇండియన్స్‌కు వికెట్ కీపింగ్‌లో మెలకువలు నేర్పించడమే కాకుండా టాలెంట్ సీకర్‌గా కూడా ఆయన పనిచేస్తున్నారు.
ఇదిలావుంటే ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కు కరోనా సోకింది. వీరంతా ఇప్పుడు చికిత్స పొందుతున్నారు.