IPL 2021: రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్.. టోర్నీ మొత్తానికి ఆర్చర్ దూరం.!

ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్...

IPL 2021: రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్.. టోర్నీ మొత్తానికి ఆర్చర్ దూరం.!
England pacer Jofra Archer

Updated on: Apr 25, 2021 | 10:49 AM

ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇండియాతో సిరీస్ సందర్భంగా గాయపడిన ఆర్చర్.. సర్జరీ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు. టోర్నీ ఫస్టాఫ్ కు అతడు దూరమైనా.. సెకండ్ హాఫ్ కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం భావించింది. అయితే గాయం నుంచి కోలుకోవడానికి మరిన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆర్చర్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇప్పటికే బెన్ స్టోక్స్, లివింగ్ స్టన్ దూరం కావడం రాజస్థాన్ కు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి.

కాగా, నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 134 పరుగుల టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి చేధించింది. శాంసన్ 42 పరుగులతో అజేయంగా నిలవగా.. మోరిస్ కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. దీనితో రాజస్థాన్ ఐదు మ్యాచ్ ల్లో రెండు విజయాలు.. మూడు ఓటములు ఎదుర్కొంది.

Follow Us