చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ టీంలకు గుడ్ న్యూస్.. రంగంలోకి స్టార్ ప్లేయర్లు.. ఇక ఫ్యాన్స్‌కి పండగే

|

Aug 03, 2021 | 3:15 PM

IPL 2021: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2021 తదుపరి సీజన్‌ను నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. దీంతో ఫ్రాంచైజీలతోపాటు అభిమానులకు గుడ్ న్యూస్ లభించింది.

చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ టీంలకు గుడ్ న్యూస్.. రంగంలోకి స్టార్ ప్లేయర్లు.. ఇక ఫ్యాన్స్‌కి పండగే
Ipl 2
Follow us on

IPL 2021: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2021 తదుపరి సీజన్‌ను నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. దీంతో ఫ్రాంచైజీలతోపాటు అభిమానులకు గుడ్ న్యూస్ లభించింది. సెప్టెంబర్-అక్టోబర్‌లో జరగనున్న టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే సమస్యను పరిష్కరించింది. ఓ నివేదిక ప్రకారం, టోర్నమెంట్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రీన్ సిగ్నల్ పొందారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) తన ఆటగాళ్లను లీగ్‌లో ఆడేండుకు అనుమతించింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు దీంతో లాభపడనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 నుంచి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య మ్యాచ్‌తో తిరిగి ప్రారంభమవుతుంది.

ఐపీఎల్ 2021 లో ఇంగ్లండ్ నుంచి 12 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఏఎన్‌ఐ నివేదిక ప్రకారం, ఐపీఎల్ పున ప్రారంభంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. దీనికి బీసీసీఐ పచ్చ జెండా ఊపింది. ఈమేరకు సెక్రటరీ (జయ్ షా) ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్‌తోనే కాకుండా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌తో కూడా షా మంచి సంబంధాలను కలిగి ఉన్నాడేందుకు ఇదే నిదర్శనం.

ఇంగ్లండ్-బంగ్లాదేశ్ సిరీస్‌ను వాయిదా..
వాస్తవానికి, ఐపీఎల్ సమయంలో ఇంగ్లండ్ టీం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుతానికి ఈ సిరీస్ వాయిదా వేశారు. కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండు బోర్డుల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఐపీఎల్ 2021 కోసం ఈ ఆటగాళ్లు అందుబాటులో ఉండేందుకే ఇంగ్లండ్-బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆష్లే గిల్స్ స్పందిస్తూ.. రాబోయే కాలంలో ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చేందుకే సిరీస్ తేదీలను మార్చాం. అంటే ఐపీఎల్‌లో ఆడేందుకు కాదని, ఆటగాళ్లు తమ దేశ జట్టుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపాడు.

ఈ ఆటగాళ్లపైనే దృష్టి..
ఇంగ్లండ్ ఆటగాళ్ల రాకతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ప్రయోజనం పొందుతుంది. మొయిన్ అలీ, సామ్ కుర్రాన్ అద్భుతంగా ఆడుతున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా లాభం పొందనుంది. ఆ టీం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నారు. అదే సమయంలో, జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ కోసం తిరిగి రానున్నాడు. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు. ఈ జట్లే కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో, ఢిల్లీ క్యాపిటల్స్ టీం కోసం టామ్ కుర్రాన్, సామ్ బిల్లింగ్స్ అందుబాటులో ఉంటారు.

Also Read:  IND vs ENG: రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరు..? టీమిండియాను వేధిస్తోన్న కొత్త సమస్య

Tokyo Olympics 2020: బ్యాడ్మింటన్‌లో ఆసియా ఆధిపత్యానికి బ్రేకులు.. గోల్డ్ మెడల్ గెలిచాక కన్నీళ్లు పెట్టిన డెన్మార్క్ ప్లేయర్.. ..!