IPL 2021 DC vs CSK: ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి మొదటి స్థానంలో నిలిచింది. లీగ్ దశలో తమ 13 వ మ్యాచ్ ఆడుతున్న రెండు జట్లకు, ఈ మ్యాచ్‌లో విజయం మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు కీలకంగా మారింది. రిషబ్ పంత్ జట్టు అత్యల్ప స్కోరింగ్‌లో అద్భుత విజయాన్ని దక్కించుకుంది. అయితే, ధోని టీం ఓడిపోవడానకి, ఢిల్లీ టీం గెలవాడానికి గల కారణాలు చూద్దాం.
అక్షర్-అశ్విన్: స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీకి అత్యంత ముఖ్యమైన బాధ్యతను పోషించారు. పవర్‌ప్లే మొదటి రెండు ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చినా.. మూడవ ఓవర్‌లో వచ్చిన అక్షర్, ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఔట్ చేయడం ద్వారా మొదటి వికెట్‌ను తీసుకున్నాడు. దీని తరువాత, ఇద్దరూ 7 వ ఓవర్ నుంచి 11 వ ఓవర్ మధ్య నిరంతరం బౌలింగ్ చేశారు. మొయిన్ అలీ, రాబిన్ ఉతప్పలను కూడా పెవిలియన్ చేర్చారు. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్లు పడగొట్టారు. అక్షర్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.
ధోనీ స్లో ఇన్నింగ్స్ – చెన్నై మొదటి వికెట్ పతనమైనప్పటి నుంచి ఇబ్బందుల్లో కూరకపోయింది. మిడిల్ ఓవర్లలో జట్టు కొన్ని వికెట్లు కూడా కోల్పోయింది. అటువంటి పరిస్థితిలో, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని 9 వ ఓవర్లో క్రీజులోకి వచ్చారు. ఐదో వికెట్‌కు 64 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. 20 వ ఓవర్‌లో ధోని ఔట్ అయ్యాడు. ఈ 70 పరుగులలో ధోని 18 పరుగులు మాత్రమే చేశాడు. రవీంద్ర జడేజా చివరి ఓవర్‌లో వచ్చాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఆడాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో ధోనీ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. దీంతో చెన్నై స్కోరు 150 కి చేరుకోలేకపోయింది.
గౌతమ్ ఫీల్డింగ్ – స్కోరు చిన్నదై అయినా.. చెన్నై బౌలర్లు కూడా ఢిల్లీని ఇబ్బందుల్లోకి నెట్టారు. 17 ఓవర్లలో ఢిల్లీ టీం కేవలం 109 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన హెట్మైర్ చెన్నై చేతుల నుంచి విజయావకాశాలను లాగేసుకున్నాడు. షిమ్రాన్ హెట్మైర్ 18 వ ఓవర్లో డ్వేన్ బ్రావో వేసిన బాల్‌ను లాంగ్ ఆన్‌లో ఆడాడు. అయితే ప్రత్యామ్నాయ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఒక సాధారణ క్యాచ్‌ను వదులేశాడు. హెట్‌మైర్ ఆ సమయంలో 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. క్యాచ్ మిస్ అయిన తర్వాత ఆ బంతి బౌండరీ చేరుకుంది. దీంతో లైఫ్ దొరికిన హెట్మైర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును విజయానికి చేర్చాడు.
Also Read: క్రికెట్ టీంపై దొంగల దాడి.. డబ్బుతోపాటు వాటిని కూడా తీసుకెళ్లారంటూ కీపర్ ఆవేదన.. అసలేం జరిగిందంటే?