IPL 2021: రెడ్ అండ్ గోల్డ్.. పంజాబ్‌ కింగ్స్‌ జెర్సీ వచ్చేసింది.. ఫుల్ టు ఫుల్ లోకల్.. చూశారా..!

|

Mar 30, 2021 | 7:36 PM

ఐపీఎల్‌ 2021 జోష్ మొదలు కాబోతోంది. ఇప్పటికే కొన్ని జట్ల సభ్యులు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. రాబోయే సీజన్‌ కోసం ఫ్రాంఛైజీలన్నీ కొత్త జెర్సీలను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే..

IPL 2021: రెడ్ అండ్ గోల్డ్.. పంజాబ్‌ కింగ్స్‌ జెర్సీ వచ్చేసింది.. ఫుల్ టు ఫుల్ లోకల్.. చూశారా..!
Ipl 2021 Punjab Kings Unveil New Jersey
Follow us on

Punjab New Jersey: ఐపీఎల్‌ 2021 జోష్ మొదలు కాబోతోంది. ఇప్పటికే కొన్ని జట్ల సభ్యులు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. రాబోయే సీజన్‌ కోసం ఫ్రాంఛైజీలన్నీ కొత్త జెర్సీలను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ నూతన జెర్సీలను విడుదల చేశాయి.

తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ సరికొత్త డిజైన్‌తో రూపొందించిన జెర్సీని మంగళవారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా గోల్డెన్‌ స్ట్రిప్‌లతో రెడ్‌ జెర్సీని తయారు చేశారు. కేకేఆర్‌, ఆర్‌సీబీ తర్వాత గోల్డెన్‌ కలర్‌ హెల్మెట్లను వినియోగించనున్న మూడో జట్టు పంజాబే.

ఈ ఏడాది పేరు మార్చుకున్న పంజాబ్‌ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ పూర్తి మార్పులతో ఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్ 2021కు సీజన్‌కు రెడీ అవుతోంది. ముంబై వేదికగా ఏప్రిల్‌ 12న రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ ఢీ కొట్టబోతోంది.

ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కేసుల సంఖ్య ప్రమాదకంగా పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 28 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ముంబైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లపై కరోనా ఎఫెక్ట్ ఉంటోదేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్​లో పాల్గొనే క్రికెటర్లు, ఇతర సిబ్బంది బయో బబుల్​ ఉంటారని, దీంతో వాళ్లకు ఈ రూల్స్‌లో వారికి మినహాయింపు ఉంటుందని అసీమ్ గుప్తా చెప్పారు. మ్యాచ్​ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రేక్షకులకు అనుమతి లేదు కాబట్టి షెడ్యూల్​ ప్రకారం అవి జరుగుతాయని వెల్లడించారు.

ముంబై వాంఖడే స్టేడియంలో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్​కతా నైట్​రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు సాధన చేస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్రలోని కరోనా ఆంక్షలు ఐపీఎల్​ను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అక్కడి మ్యాచ్​లనే వేరే చోటుకు తరలించే విషయమై బీసీసీఐ ఆలోచన చేస్తోందని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఈ సీజన్​ మొదటి మ్యాచ్​లో ముంబై-బెంగళూరు జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. చెన్నై-ఢిల్లీ మధ్య రెండో మ్యాచ్​ ముంబైలో జరగనుంది. కాగా ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తమ ఫేవరెట్ టీమ్స్.. సత్తా చాటాలని ఆశపడుతున్నారు. మరి ఈ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మ్యాచ్‌లు ఎలా జరుగుతాయో, కప్పు ఎవరు ఎగరేసుకుపోతారో చూడాలి.

ఇవి కూడా చదవండి : TTD Plans: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల‌లో ట్రాఫిక్‌ ప్రాబ్లమ్స్‌కి చెక్.. మ‌ల్టీలెవ‌ల్ కార్ పా‌ర్కింగ్‌ల ఏర్పాటు.. కొండపై ఎక్కడో తెలుసా..

Sultan of Multan: ముల్తాన్ కా సుల్తాన్‌.. పాకిస్తాన్‌కు చెప్పి మరీ కొట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు మూడు సెంచరీలు..

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?