IPL 2021 Auction LIVE: రసవత్తరంగా ఐపీఎల్ మినీ వేలం.. అర్జున్ టెండూల్కర్‌ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్

|

Feb 18, 2021 | 10:06 PM

IPL 2021 Auction LIVE in Telugu: ఐపీఎల్ 2021 మెగా ఆక్షన్‌ కొనసాగుతోంది. చెన్నై వేదికగా బయోబబుల్ వాతావరణంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ ప్రారంభమైంది....

IPL 2021 Auction LIVE: రసవత్తరంగా ఐపీఎల్ మినీ వేలం.. అర్జున్ టెండూల్కర్‌ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్

IPL 2021 Auction LIVE in Telugu: ఐపీఎల్ 2021 మెగా ఆక్షన్‌ కొనసాగుతోంది. చెన్నై వేదికగా బయోబబుల్ వాతావరణంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఐపీఎల్ ఆక్షన్ గ్రాండ్‌గా జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా కుదరలేదు.  ఈ జాబితాలో 1,114 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. మొత్తం 298 మందికి అనుమతి దక్కింది. ఈ లిస్టులో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు..

ఐపీఎల్ చరిత్రను తిరిగరాసిన క్రిస్ మోరిస్‌

చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ కొనసాగుతోంది. అనూహ్యంగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను అత్యధిక ధర రూ. 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది. గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ చరిత్రలో ఇదే భారీ మొత్తం కావడం గమనార్హం. క్రిస్ మోరిస్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో అతడిని ఆర్సీబీ రిలీజ్ చేసింది. బేస్ ప్రైస్ రూ. 75 లక్షల నుంచి రూ. 16.25 కోట్ల వరకు పలికిన మోరిస్‌ను చివరికి రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది. అటు మ్యాక్స్‌వెల్‌ను రూ. 16,25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకుంది. యువరాజ్ సింగ్ తర్వాత రూ. 16 కోట్లు దాటిన రెండో ఆటగాడు క్రిస్ మోరిస్‌.

జాక్ పాట్ కొట్టేసిన ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్‌వెల్‌ 

ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మళ్లీ జాక్‌ పాట్‌ కొట్టేశాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.5 కోట్ల నుంచి చెన్నై, బెంగళూరు అతడిని దక్కించుకొనేందుకు విపరీతంగా పోటీపడ్డాయి. చెన్నై వద్ద తక్కువ మొత్తమే ఉండటంతో రూ.14 కోట్ల వరకు ప్రయత్నించి చివరకు వదిలేసింది.

వేలం పాటలో స్టీవ్ స్మిత్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..

ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ శరవేగంగా సాగుతోంది. చెన్నై వేదికగా సాగుతున్న ఈ వేలం పాటలో తొలి ప్లేయర్‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. గత కొన్ని సీజన్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ. 2.20 కోట్లకు కొనుగోలు చేసింది. మొదటిగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ స్టీవ్ స్మిత్‌పై దృష్టి సారించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం పాటలో రూ. 2.20 కోట్లకు దక్కించుకుంది. దీనితో ఈ ఏడాది వేలం పాటలో మొదటిగా అమ్ముడైన ప్లేయర్‌ స్టీవ్ స్మిత్ కావడం విశేషం. అటు ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫస్ట్ సెట్‌లో అమ్ముడుపోకపోవడం గమనార్హం.

 

కోట్లు పలికిన తమిళనాడు ఫినిషర్‌ షారుక్‌ ఖాన్‌

తమిళనాడు ఫినిషర్‌ షారుఖ్ ఖాన్‌ కోట్లు కొట్టేశాడు. రూ.20 లక్షల కనీస ధరలో ఉన్న అతడిని పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా రూ.5.25 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. షారుఖ్ కోసం బెంగళూరు ఆసక్తి ప్రదర్శించింది. దాంతో రెండు జట్లు ధరను పెంచుకుంటూ వెళ్లాయి. గతంలో షారుఖ్ ఖాన్‌ అండర్‌-19 ప్రపంచకప్‌, ఐపీఎల్‌ మిస్సైనా ఈ సారి మాత్రం జాక్‌పాట్‌ దక్కించుకున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో అతడు మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే.

కృష్ణప్ప గౌతమ్‌ అద్భుతం…

కర్నాటక ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ ఐపీఎల్‌ వేలంలో మంచి ఛాన్స్ దక్కించుకున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని రూ.9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతడి కనీస ధర రూ.20 లక్షలే కావడం గమనార్హం. గతంలో అతడు పంజాబ్‌కు ఆడాడు. వేలంలోకి రాగానే అతడి కోసం హైదరాబాద్‌, కోల్‌కతా పోటీ పడ్డాయి. ధర పెంచుకుంటూ వెళ్లాయి. హైదరాబాద్‌ రూ.7.5 కోట్లకు బిడ్‌ వేసినప్పుడు అనూహ్యంగా చెన్నై రంగంలోకి దిగింది. ఆఖరికి రూ.9.25 కోట్లకు దక్కించుకుంది.

రిచర్డ్‌సన్‌ అదుర్స్…

మరో ఆస్ట్రేలియన్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ మెరిశాడు. పంజాబ్‌ జట్టు ఏకంగా రూ.14కోట్లు పెట్టి ఈ యువ స్పీడ్‌గన్‌ను సొంతం చేసుకుంది. రిచర్డ్‌సన్‌ను దక్కించుకోవడానికి దిల్లీ, బెంగళూరు, ముంబయి చివరివరకూ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియన్‌ టీ20 స్పెషలిస్టు మ్యాక్స్​వెల్​ను వదులుకున్న పంజాబ్‌ ఆ స్థానంలో రిచర్డ్‌సన్‌ను కొనుక్కోవడం విశేషం.

ఆస్ట్రేలియన్‌ పేసర్‌ మెరెడిత్‌ రికార్డు..

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మ్యాక్స్​వెల్​ను వదులుకున్న పంజాబ్‌ జట్టు మళ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. యువ పేసర్‌ మెరెడిత్‌ను ఏకంగా రూ.8కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. అతడి కోసం దిల్లీ, పంజాబ్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి దిల్లీ వెనక్కి తగ్గింది. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ విదేశీ క్రికెటర్​కు ఇంత ధర దక్కడం ఇదే తొలిసారి. ఇంతకుముందు జోఫ్రా ఆర్చర్​ 7.2 కోట్లకు అమ్ముడయ్యాడు.

సచిన్ కుమారుడిని దక్కించుకుంది ఎవరో తెలుసా..

ఐపీఎల్‌ 2021 వేలం ముగిసింది. వేలంలో చివరి పేరు అర్జున్‌ తెందూల్కర్‌. అతడి పేరు రాగానే ముంబై ఇండియన్స్‌ వెంటనే కనీస ధరకు కొనుగోలు చేసింది. మరే జట్టు సొంతం చేసుకొనేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు.

ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్(అమ్ముడుపోయిన ప్లేయర్స్ లిస్టు):

  1. స్టీవ్ స్మిత్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 2.20 కోట్లు)
  2. గ్లెన్ మ్యాక్స్‌వెల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ.14.25 కోట్లు)
  3. షకిబుల్ హాసన్ – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ.3.20 కోట్లు)
  4. మొయిన్ అలీ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 7 కోట్లు)
  5. శివమ్ దూబే – రాజస్థాన్ రాయల్స్(రూ. 4.40 కోట్లు)
  6. క్రిస్ మోరిస్ – రాజస్థాన్ రాయల్స్(రూ.16.25 కోట్లు)
  7. డేవిడ్ మాలన్ – పంజాబ్ కింగ్స్(రూ.1.50 కోట్లు)
  8. ఆడమ్ మిలన్- ముంబై ఇండియన్స్(రూ.3.20 కోట్లు)
  9. జహ్య్ రిచర్డ్‌సన్ – పంజాబ్ కింగ్స్(రూ.14 కోట్లు)
  10. నాథన్ కౌల్టర్‌నైల్ – ముంబై ఇండియన్స్(రూ.5 కోట్లు)
  11. ఉమేష్ యాదవ్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ.1 కోటి)
  12. పీయూష్ చావ్లా – ముంబై ఇండియన్స్(రూ. 2.40 కోట్లు)
  13. సచిన్ బేబీ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
  14. రిపల్ పటేల్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
  15. షారుఖ్ ఖాన్ – పంజాబ్ కింగ్స్(రూ.5.25 లక్షలు)
  16. విష్ణు వినోద్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
  17. కృష్ణప్ప గౌతమ్ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 9.25 కోట్లు)
  18. షెల్డన్ జాక్సన్ – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ. 20 లక్షలు)
  19. మొహమ్మద్ అజారుద్దీన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
  20. లుక్‌మెన్ హుస్సేన్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
  21. చేతన్ సకారియా – రాజస్థాన్ రాయల్స్(రూ. 1.20 కోట్లు)
  22. మెరెడిత్ – పంజాబ్ కింగ్స్(రూ. 8 కోట్లు)
  23. ఎం. సిద్ధార్థ్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 20 లక్షలు)
  24. జగదీశ్ సుచిత్ – సన్‌రైజర్స్ హైదరాబాద్(రూ. 30 లక్షలు)
  25. కెరిప్పా – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
  26. పుజారా – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 50 లక్షలు)
  27. జేమిసన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 15 కోట్లు)
  28. టామ్ కరన్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 5.25 కోట్లు)
  29. హెన్రికస్ – పంజాబ్ కింగ్స్ (రూ.  4.20 కోట్లు)
  30. జలజ్ సక్సేనా – పంజాబ్ కింగ్స్(రూ. 30 లక్షలు)
  31. ఉత్కరేష్ సింగ్ – పంజాబ్ కింగ్స్(రూ. 20 లక్షలు)
  32. హరిశంకర్ రెడ్డి – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
  33. వైభవ్ అరోరా – కోల్‌కతా నైట్ రైడర్స్(రూ. 20 లక్షలు)
  34. ఫైబి అలెన్ – పంజాబ్ కింగ్స్(రూ. 75 లక్షలు)
  35. కుల్దీప్ యాదవ్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
  36. డానియల్ క్రిస్టియన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 4.80 కోట్లు)
  37. జేమ్స్ నీషమ్ – ముంబై ఇండియన్స్(రూ. 50 లక్షలు)
  38. లివింగ్‌స్టన్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 75 లక్షలు)
  39. సుయాష్ ప్రభు దేశాయ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
  40. యుద్‌విర్ చరాక్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)
  41. కెఎస్ భరత్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)
  42. భగత్ వర్మ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
  43. మార్కో జాన్సెన్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)
  44. సౌరబ్ కుమార్ – పంజాబ్ కింగ్స్(రూ. 20 లక్షలు)
  45. కరుణ్ నాయర్ – కేకేఆర్( రూ. 50 లక్షలు)
  46. కేదార్ జాదవ్ – సన్ రైజర్స్ (రూ. 2 కోట్లు)
  47. సామ్ బిల్లింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్(రూ. 2 కోట్లు)
  48. ముజీబ్ – సన్ రైజర్స్ హైదరాబాద్ (రూ. 1.50 కోట్లు)
  49. హర్భజన్ సింగ్ – కేకేఅర్ (రూ. 2 కోట్లు)
  50. హరి నిశాంత్ – చెన్నై సూపర్ కింగ్స్(రూ. 20 లక్షలు)
  51. బెన్ కట్టింగ్ – కేకేఅర్ (రూ. 75 లక్షలు)
  52. వెంకటేష్ అయ్యర్ – కేకేఅర్(రూ. 20 లక్షలు)
  53. పవన్ నేగి – కేకేఅర్(రూ. 50 లక్షలు)
  54. ఆకాష్ సింగ్ – రాజస్థాన్ రాయల్స్(రూ. 20 లక్షలు)
  55. అర్జున్ టెండూల్కర్ – ముంబై ఇండియన్స్(రూ. 20 లక్షలు)
  56. ముస్టాఫీజుర్ రెహమాన్ – రాజస్థాన్ రాయల్స్(రూ. కోటి)
  57. రజిత్ పటిదార్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(రూ. 20 లక్షలు)

వీరికి నిరాశే మిగిలింది..

చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం రసవత్తరంగా కొనసాగుతోంది.  పలువురు స్టార్ అంతర్జాతీయ ప్లేయర్స్ తక్కువ ధరకు అమ్ముడుపోగా.. అంచనాలు లేని కొంతమంది ఆటగాళ్లు మాత్రం భారీ రేటు పలికారు. ఇక సీనియర్, వెటర్నర్ ప్లేయర్స్‌కు మాత్రం ఈ వేలంలో నిరాశే మిగిలింది. చాలామంది ఫ్రాంచైజీలు వారిని అసలు ఎంపిక చేయలేదు. తమ జట్ల కూర్పును బలపరుచుకునే భాగంలో ఎక్కువగా యువ కెరటాలను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అమ్ముడుపోని ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2021 మినీ వేలం (అమ్ముడుపోని ప్లేయర్స్ లిస్టు):

    1. అలెక్స్ హేల్స్
    2. ఎవిన్ లెవీస్
    3. జాసన్ రాయ్
    4. అరోన్ ఫించ్
    5. హనుమ విహారి
    6. ఫిలిప్స్
    7. అలెక్స్ క్యారీ
    8. కుశాల్ పెరెరా
    9. షెల్డన్ కాట్రెల్
    10. అడిల్ రషీద్
    11. ఇష్ సోది
    12.  క్వాయిస్ అహ్మద్
    13. హిమాన్షు రానా
    14. హిమ్మత్ సింగ్
    15. విష్ణు సోలంకి
    16. అటిట్ సేథ్
    17. వివేక్ సింగ్
    18. ఆయుష్ బడోని
    19. కేడర్ దేవధర్
    20. అవి బరోట్
    21. ఎం. యూసఫ్
    22.  అంకిత్ రాజపూత్
    23. కుల్దీప్ సేన్
    24. తుషార్ దేశ్ పాండే
    25. కరణ్ వీర్ సింగ్
    26. సందీప్ లెమిచాన
    27. తేజస్ బరోక్
    28. మిధున్ సుదేశన్
    29. డారెన్ బ్రేవో
    30. రౌమన్ పావెల్
    31. షాన్ మార్ష్
    32. కోరీ ఆండర్సన్
    33. డెవన్ కాన్‌వే
    34. డుస్సేన్
    35. మార్టిన్ గప్తిల్
    36. గురుక్రీట్ సింగ్
    37. లబుషెన్
    38. వరుణ్ ఆరోన్
    39. ఓషన్ థామస్
    40. మోహిత్ శర్మ
    41. స్టాన్‌లేక్
    42. మెక్‌లెగాన్
    43. జాసన్ బెరెండ్రోఫ్
    44. నవీన్ ఉల్ హాక్
    45. కరణ్ శర్మ
    46. జోష్ ఇంగ్లీష్
    47. సమర్జీట్ సింగ్
    48. బెన్ ద్వార్షుసిస్
    49. పెరియార్ స్వామి
    50. స్కాట్ కుగాలైన్
    51. పార్నిల్
    52. టోప్లి
    53. తిషారా పెరారా
    54. మెక్‌డోర్మేట్
    55. వేడ్
    56. క్రిస్ గ్రీన్
    57. సీన్ అబాట్
    58. ఉదానా
    59. సిద్దేశ్ లాడ్
    60. తజేంద్ర ధిల్లాన్
    61. ప్రేరక్ మంకండ్
    62. లిండే
    63. చైతన్య బిష్ణోయ్
    64. విల్దర్‌మత్
    65. హర్ష ట్యాగీ
    66. కోట్జీ
    67. టిమ్ డేవిడ్
    68. ప్రత్యూష్ సింగ్

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Feb 2021 08:37 PM (IST)

    ఐపీఎల్ 2021 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు..

    ఐపీఎల్ వేలంపాట చరిత్రలో అమ్ముడైన అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మారిస్  నిలిచాడు. మారిజ్ 16.25 కోట్ల ధరతో యువరాజ్ సింగ్ (రూ .16 కోట్లు) రికార్డును బద్దలు కొట్టాడు.

  • 18 Feb 2021 08:21 PM (IST)

    అర్జున్ టెండూల్కర్‌ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్

    ఐపీఎల్‌ 2021 వేలం ముగిసింది. వేలంలో చివరి పేరు అర్జున్‌ తెందూల్కర్‌. అతడి పేరు రాగానే ముంబై ఇండియన్స్‌ వెంటనే కనీస ధరకు కొనుగోలు చేసింది. మరే జట్టు సొంతం చేసుకొనేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు.

  • 18 Feb 2021 07:55 PM (IST)

    కేఎస్ భరత్‌- రూ.20 లక్షలు

    ఆంధ్రా వికెట్‌ కీపర్‌ కేఎస్ భరత్‌ను బెంగళూరు రూ.20 లక్షలకు దక్కించుకుంది.

  • 18 Feb 2021 07:52 PM (IST)

    ‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలన్‌- రూ.75 లక్షలు

    వెస్టిండీస్‌ పవర్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. రూ.75 లక్షల కనీస ధరతో సొంతం చేసుకుంది.

  • 18 Feb 2021 07:49 PM (IST)

    డాన్‌ క్రిస్టియన్‌కు రూ.4.8 కోట్లు..

    ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డాన్‌ క్రిస్టియన్‌ను బెంగళూరు సొంతం చేసుకుంది. కోల్‌కతాతో పోటీ పడి రూ.4.8 కోట్లకు దక్కించుకుంది. రూ.75 లక్షల కనీస ధర గల క్రిస్టియన్‌ భారీ మొత్తమే దక్కించుకున్నాడు.

  • 18 Feb 2021 07:29 PM (IST)

    ఐపీఎల్‌ వేలం రెండో సెషన్‌ మొదలైంది

    ఐపీఎల్‌ వేలం రెండో సెషన్‌ ఆరంభమైంది. ఈ సెషన్‌లో ఎవరు కోట్లు కొల్లగొడతారో చూడాలి..

  • 18 Feb 2021 07:12 PM (IST)

    ఐపీఎల్‌ వేలానికి బ్రేక్

    ప్రస్తుతం ఐపీఎల్‌ వేలానికి బ్రేక ఇచ్చారు. రెండో సెషన్‌ రాత్రి 7: 15 గంటలకు ఆరంభమవుతుంది.

  • 18 Feb 2021 06:28 PM (IST)

    పంజాబ్‌కు ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మోజెస్‌ హెన్రిక్స్‌

    ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మోజెస్‌ హెన్రిక్స్‌ను పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. రూ.4.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతడి కోసం చివరి వరకు దిల్లీ పోటీ పడినా పంజాబే నెగ్గింది.

  • 18 Feb 2021 06:23 PM (IST)

    హైదరాబాద్‌తో పోటీ పడిన ఢిల్లీ క్యాపిటల్స్.. కానీ..

    ఇంగ్లాండ్‌ ఆటగాడు టామ్‌ కరన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. హైదరాబాద్‌తో పోటీపడి మరీ అతడిని కొనుగోలు చేసింది.

  • 18 Feb 2021 06:18 PM (IST)

    కైల్ జేమినసన్‌ని దక్కించకున్న బెంగళూరు

    విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో కోట్ల రూపాయాలను కొట్టేస్తున్నారు. కైల్‌ జేమిసన్‌ను బెంగళూరు రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కైల్ జేమినసన్‌ని దక్కించుకొనేందుకు పంజాబ్‌ కింగ్స్‌ సైతం రూ.14.75 కోట్ల వరకు బిడ్‌ దాఖలు చేసింది. చివరికి బెంగళూరుకు వదిలేసింది. మాక్స్‌వెల్‌ బిడ్‌ను దాటేసి జేమిసన్‌ ధర పలకడం విశేషం.

  • 18 Feb 2021 06:06 PM (IST)

    అమ్ముడు పోని అంతర్జాతీయ ఆటగాళ్ళు వీరే..

    అమ్ముడు పోని అంతర్జాతీయ ఆటగాళ్ళు

    1. ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ బ్యాట్స్ మాన్ సీన్ మార్ష్ కొనుగోలుదారులను కనుగొనలేదు. మూల ధర – రూ .1.50 కోట్లు
    2. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరీ ఆండర్సన్ కూడా దక్కని చోటు , మూల ధర- రూ .75 లక్షలు
    3. న్యూజిలాండ్ బ్యాట్స్ మాన్ డెవాన్ కాన్వే కూడా అమ్మలేదు, మూల ధర – 50 లక్షలు
    4. వెస్టిండీస్ బ్యాట్స్ మాన్ డారెన్ బ్రావో కూడా అంతే.., బేస్ ధర- 75 లక్షలు
    5. దక్షిణాఫ్రికాకు చెందిన రాసి వాన్ డెర్ డుసేన్ అమ్ముడ పోలేదు, మూల ధర – 50 లక్షలు
  • 18 Feb 2021 06:04 PM (IST)

    చేతేశ్వర్ పుజారా దక్కించుకున్న చెన్నై

    చేతేశ్వర్ పుజారాకు 2014 తర్వాత మొదటిసారి కొనుగోలు చేశారు. రూ .50 లక్షల మూల ధర వద్ద, చెన్నై సూపర్ కింగ్స్ పూజారాను కొనుగోలు చేసింది.

  • 18 Feb 2021 05:52 PM (IST)

    హరికేన్‌ యువపేసర్ మెరెడిత్‌ మెరిసాడు

    ఆస్ట్రేలియా, హోబర్ట్‌ హరికేన్‌ యువపేసర్ మెరెడిత్‌ మెరిసాడు. పంజాబ్‌ కింగ్స్‌ రూ.8 కోట్లు పెట్టి దక్కించుకుంది. రూ.40 లక్షల కనీస ధరలో ఉన్న అతడి కోసం ఢిల్లీ, పంజాబ్‌ పోటీ పడ్డాయి పోటీ పడ్డాయి. ధరను పెంచుకుంటూ వెళ్లాయి. చివరికి యువ పేసర్ ను పంజాబ్ దక్కించుకుంది.

  • 18 Feb 2021 05:49 PM (IST)

    పేసర్‌ చేతన్‌ సకారియా వరించిన లక్కు..

    సౌరాష్ట్ర లెఫ్ట్ హాండ్ పేసర్‌ చేతన్‌ సకారియాను అదృష్టం పట్టుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.1.2 కోట్లకు సొంతం చేసుకుంది. రూ.20 లక్షల కనీస ధరలో ఉన్న అతడిని కొనుగోలు చేసేందుకు బెంగళూరు చివరి వరకు పోటీ పడింది. సకారియా 16 టీ20ల్లో 7.08 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టాడు.

  • 18 Feb 2021 05:31 PM (IST)

    చేతన్ సకారియాను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్..

    చేతన్ సకారియా కోసం ఆర్సీబీ దక్కించుకుంది. రూ. 1.2 కోట్లు పలికాడు.

  • 18 Feb 2021 05:20 PM (IST)

    కె.గౌతమ్‌ను దక్కించుకున్న చెనై జట్టు

    కె.గౌతమ్‌ను దక్కించుకున్న చెన్నై సూపర్ కింగ్స్.

     

  • 18 Feb 2021 05:19 PM (IST)

    కె గౌతమ్ కోసం పోటీ.. పోటీ పడిన హైదరాబాద్..

    కె గౌతమ్ కోసం కెకెఆర్ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య బిడ్డింగ్, బిడ్ రూ .6 కోట్లు దాటింది

  • 18 Feb 2021 05:17 PM (IST)

    షారుఖ్ ఖాన్‌ను గెలుచుకున్న పంజాబ్..

    పంజాబ్, ఢిల్లీ మధ్య మంచి పోటీ నడిచింది. భారీగా ధరను పెంచారు. మధ్యలో ఆర్సీబీ కూడా పోటీ పడింది.చివరికి పంజాబ్ రూ. 5.25కు దక్కించుకుంది.

  • 18 Feb 2021 05:11 PM (IST)

    షారుఖ్ ఖాన్ కోసం పోటీ

    షారుఖ్ ఖాన్‌ను కొనేందకు పోటీ పడుతున్నాయి. మూల ధర: రూ .20 లక్షలు, ఢిల్లీ జట్టు, ఆర్‌సిబి మధ్య బిడ్డింగ్ నడుస్తోంది..

  • 18 Feb 2021 05:05 PM (IST)

    అమ్ముడు పోకపోవడంపై ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ కామెంట్

    ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ ఈసారి వేలంలో కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోయాడు. అతను సరదాగా ట్వీట్ చేశాడు-

  • 18 Feb 2021 04:55 PM (IST)

    పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను రూ.కోటి కొనుగోలు చేసిన ఢిల్లీ

    టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను ఢిల్లీ కేవలం రూ.కోటికే సొంతం చేసుకుంది. మరెవ్వరూ అతడి కోసం ఆసక్తి ప్రదర్శించలేదు.

  • 18 Feb 2021 04:54 PM (IST)

    అమ్ముడు పోని హర్భజన్ సింగ్

    హర్భజన్ సింగ్ ను కొనేందుకు ఏ జట్టుకూడా ముందుకు రాలేదు.

  • 18 Feb 2021 04:53 PM (IST)

    ముంబై ఇండియాన్స్ సొంతం చేసుకున్న నేథన్‌ కౌల్టర్‌ నైల్‌

    ఆసీస్‌ పేసర్‌ నేథన్‌ కౌల్టర్‌ నైల్‌ను కూడా ముంబై ఇండియాన్స్ సొంతం చేసుకుంది. రూ.1.5 కోట్ల కనీస ధర నుంచి అతడు రూ. 5 కోట్లు పలకడం గమనార్హం. ఢిల్లీ చివరి వరకు పోటీపడ్డా ముంబై  అతడిని సొంతం చేసుకుంది.

  • 18 Feb 2021 04:51 PM (IST)

    ఆడమ్‌ మిల్న్‌ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌

    న్యూజిలాండ్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్న్‌ను ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. రూ. 50లక్షల కనీస ధరలో ఉన్న అతడి కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ పోటీ పడింది.  చివర్లో హైదరాబాద్‌ రంగంలోకి దిగినా ముంబై  అతడిని దక్కించుకుంది.

  • 18 Feb 2021 04:32 PM (IST)

    డేవిడ్‌ మలన్‌ ధర రూ.1.5 కోట్లకే..

    ఇంగ్లాండ్‌ ఆటగాడు..టీ20 ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ను రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది.

  • 18 Feb 2021 04:30 PM (IST)

    కుసల్ పెరెరా అమ్ముడు పోలేదు..

    కుసల్ పెరెరా, మూల ధర: రూ .50 లక్షలు, అమ్ముడుపోలేదు

  • 18 Feb 2021 04:29 PM (IST)

    అమ్ముడు పోని అలెక్స్ కారీ..

    అలెక్స్ కారీ అమ్ముడు పోలేదు.. ఇతడిని కొనేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. మూల ధర: 1.5 కోట్లు, అమ్ముడుపోలేదు

  • 18 Feb 2021 04:07 PM (IST)

    Chris Morris bought: క్రిస్‌మోరిస్‌ను గెలుచుకున్న పంజాబ్

    దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ కోసం జట్లు విపరీతంగా పోటీ పడ్డాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. చివరి వరకు అతడి కోసం పంజాబ్‌ కింగ్స్‌ పోటీ పడింది. మొదట బెంగళూరు ధర పెంచుతూ పోయింది. రూ.5కోట్లు దాటగానే ముంబై ఇండియాన్స్ రంగంలోకి దిగింది. రూ.12 కోట్లు దాటగానే రాజస్థాన్‌ రాయల్స్‌ వచ్చింది. ఈ క్రమంలో పంజాబ్‌, రాయల్స్‌ రూ.16 కోట్ల వరకు పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్‌ అతడిని రాయల్స్‌కే విడిచిపెట్టక తప్పలేదు.

  • 18 Feb 2021 04:04 PM (IST)

    యువరాజ్ సింగ్‌ తర్వాత క్రిస్ మోరిస్

    క్రిస్ మోరిస్ బిడ్ రూ .16 కోట్లను దాటింది. ఇది ఐపిఎల్ వేలంలో అన్ని సమయాలలో అత్యంత ఖరీదైన బిడ్‌. (యువరాజ్ సింగ్‌ను 2015 లో ఢిల్లీ రూ .16 కోట్లకు కొనుగోలు చేసింది)

     

  • 18 Feb 2021 04:02 PM (IST)

    క్రిస్ మోరిస్ కోసం పోటీ

    క్రిస్ మోరిస్ కోసం పోటీ భారీగా పేరిగింది. బిడ్డింగ్ రూ .14.5 కోట్లు దాటింది..

  • 18 Feb 2021 03:56 PM (IST)

    క్రిస్ మోరిస్ కోసం పోటీ

    క్రిస్ మోరిస్ కోసం ముంబై ఇండియన్స్‌తో‌ ఆర్‌సిబి పోటీ పడుతున్నాయి.  బిడ్ రూ .10 కోట్లు దాటింది, ఆర్‌సిబి ఉపసంహరించుకుంది మరియు రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు బిడ్‌లో చేరాయి.

  • 18 Feb 2021 03:53 PM (IST)

    క్రిస్ మోరిస్ ధర: రూ .80 లక్షలు

    క్రిస్ మోరిస్ .. మూల ధర: రూ .80 లక్షలు

  • 18 Feb 2021 03:52 PM (IST)

    శివం దుబేను రూ .4.4 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్..

    శివం దుబేను రాజస్థాన్ రాయల్స్  రూ .4.4 కోట్లు కొనుగోలు చేసింది. హైదరాబాద్‌ ఓపెనింగ్‌ బిడ్‌ వేయగా చివరికి రూ.4.4 కోట్లకు రాయల్స్‌ దక్కించుకుంది.

  • 18 Feb 2021 03:48 PM (IST)

    మొయిన్ అలీ సీఎస్‌కే రూ .7 కోట్లు..

    మొయిన్ అలీ సిఎస్‌కె రూ .7 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మంచి రేటు పలికాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. అతడిని దక్కించుకొనేందుకు పంజాబ్‌ కింగ్స్‌ పోటీ పడింది. రూ.25లక్షల వంతున పెంచుకుంటూ పోయింది. అయితే చివరికి చెనై అతడిని దక్కించుకుంది.

  • 18 Feb 2021 03:45 PM (IST)

    షకిబ్‌ అల్‌ హసన్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్

    బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. చాలా సంవత్సరాలు అతడు అదే జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే.

  • 18 Feb 2021 03:34 PM (IST)

    గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను గెలుచుకున్న ఆర్సీబీ

    ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మళ్లీ భారీగా గెలుచుకున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.5 కోట్ల నుంచి చెన్నై, బెంగళూరు అతడిని దక్కించుకొనేందుకు విపరీతంగా పోటీపడ్డాయి.

    చెన్నై వద్ద తక్కువ మొత్తమే ఉండటంతో రూ.14 కోట్ల వరకు ప్రయత్నించి చివరకు వదిలేసింది.

    Maxwell ipl

  • 18 Feb 2021 03:28 PM (IST)

    గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కోసం ఆర్‌సీబీ, చెన్నై మధ్య పోటీ

    ఆసీస్‌ ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కోసం ఆర్‌సీబీ, చెన్నై సూపర్‌కింగ్స్‌ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అతడి ధర రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు చేరుకుంది. పోటీ ఇంకా కొనసాగుతోంది.

    Maxwell ipl

  • 18 Feb 2021 03:26 PM (IST)

    మాక్సీ కోసం పోటీ..

     కెకెఆర్ వెనక్కి తగ్గింది, ఇప్పుడు ఆర్‌సిబి మరియు సిఎస్‌కె మాక్సీను ఎంచుకునే పోటీలో లాక్ చేయబడ్డాయి.

  • 18 Feb 2021 03:24 PM (IST)

    మాక్స్‌వెల్ కోసం పోటీ..

    ఆసీస్‌ హిట్టర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు కోల్‌కతా ముందుగా బిడ్‌ వేసింది. రాజస్థాన్ రాయల్స్‌ దానిని కొనసాగించింది. బెంగళూరు, కోల్‌కతా ప్రస్తుతం పోటీ కొనసాగుతోంది.

  • 18 Feb 2021 03:21 PM (IST)

    లూయిస్‌, ఫించ్‌కు నో ఛాన్స్

    వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు ఎవిన్‌ లూయిన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. అలాగే ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథి ఆరోన్ ఫించ్‌దీ ఇదే పరిస్థితి.

  • 18 Feb 2021 03:20 PM (IST)

    స్టీవ్‌స్మిత్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

    ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. ఓపెనింగ్‌ బిడ్‌ను రూ.2 కోట్లకు ఆర్‌సీబీ వేయగా ఢిల్లీ మరో రూ.20 లక్షలు పెంచి దక్కించుకొంది. అతడిని కొనుగోలు చేసేందుకు మరే జట్టూ మొగ్గు చూపలేదు.

  • 18 Feb 2021 03:19 PM (IST)

    ఎవిన్ లూయిస్..

    ఐపీఎల్ వేలం 2021: ఎవిన్ లూయిస్ అమ్ముడుపోలేదు

  • 18 Feb 2021 03:16 PM (IST)

    ఎవరూ మొగ్గు చూపలేదు..

    ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జేసన్‌ రాయ్‌, అలెక్స్‌ హేల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ మొగ్గు చూపలేదు.

  • 18 Feb 2021 03:12 PM (IST)

    వేలంకు ముందు బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ…

    ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వేలం ప్రారంభానికి ముందు సభలో ప్రసంగిస్తున్నారు…

  • 18 Feb 2021 03:10 PM (IST)

    ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా..

    గతేడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలిగిన చైనా మొబైల్ ఫోన్ సంస్థ వివో మరోసారి ఈ సీజన్‌కు తిరిగి వచ్చింది. వివో స్థానంలో ఐపిఎల్ 2020 లో డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను గెలుచుకుంది. వేలం ప్రారంభంలో, ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వివో తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.

    8 జట్లలో అత్యధిక జీతం పెంచిన 8 మంది ఆటగాళ్లను పరిశీలిద్దాం.

  • 18 Feb 2021 02:58 PM (IST)

    అత్యంత ఖరీదైన స్పిన్నర్ కోసం..

    అత్యంత ఖరీదైన స్పిన్నర్ కోసం ఈ వేలంలో ముంబై సొంతం చేసుకోనుందని సమాచారం. అటు ట్రెంట్ బౌల్ట్ కోసం ఒక బ్యాకప్ విదేశీ సీమర్ ను, ఇక కీరన్ పొలార్డ్‌ కోసం మరో బ్యాకప్ విదేశీ ఆల్ రౌండర్ ను తీసుకోవాలని ముంబై జట్టు ప్రయత్నం చేయనుంది. అటు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను సైతం ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు.

  • 18 Feb 2021 02:58 PM (IST)

    ఎవరిని తీసుకోనున్నారు.? ఎందుకు.?

    ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ఛాంపియన్స్ జట్టు. అయితే చిన్న చిన్న లోపాలు లేకపోలేదు. గత రెండు సీజన్లలో కృనాల్ పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. అలాగే రాహుల్ చాహర్ స్పిన్ మంత్రం కూడా పని చేయలేదు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరూ ధారాళంగా పరుగులు సమర్పించారు.

  • 18 Feb 2021 02:57 PM (IST)

    రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే…

    టాప్-ఆర్డర్ బ్యాట్స్ మెన్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, అన్మోల్ ప్రీత్ సింగ్, ఆదిత్య తారే (వికెట్ కీపర్)

  • 18 Feb 2021 02:56 PM (IST)

    ఆకర్ష్.. ఆకర్ష్.. ఆకర్ష్.. ఇప్పుడు అందరిది ఇదే పాట…

    ఆకర్ష్.. ఆకర్ష్.. ఆకర్ష్.. ఇప్పుడు అందరిది ఇదే పాట. పొలిటికల్ పార్టీలు అనుకుంటే పొరపాటే.. ఈ పాట పాడేది ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఐపీఎల్ 2021 టైటిల్ పై గురి పెట్టి తమ జట్లను బలోపేతం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. అందుకే ఇవాళ జరగబోయే మినీ వేలంలో స్టార్ ప్లేయర్స్ ను చేజిక్కించుకోవాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

Follow us on