IPL 2021 Auction LIVE streaming: ఐపీఎల్ 2021 ఆక్షన్‌ నేడే.. సమయం, వేదిక, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు

IPL 2021 Auction LIVE Streaming online, Time, Venue: మెగా ఆక్షన్.. కొత్త టీమ్స్‌తో ఈ ఏడాది ఐపీఎల్ గ్రాండ్‌గా జరగాల్సి ఉండగా.. కరోనా...

IPL 2021 Auction LIVE streaming: ఐపీఎల్ 2021 ఆక్షన్‌ నేడే.. సమయం, వేదిక, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు
IPL 2021 Auction

Edited By: Team Veegam

Updated on: Feb 18, 2021 | 2:39 PM

IPL 2021 Auction LIVE Streaming online, Time, Venue: మెగా ఆక్షన్.. కొత్త టీమ్స్‌తో ఈ ఏడాది ఐపీఎల్ గ్రాండ్‌గా జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అదంతా కుదర్లేదు. అయితే ఫ్రాంచైజీల కోసం మినీ ఆక్షన్ నిర్వహిస్తోంది బీసీసీఐ. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే ఈ వేలం కోసం క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 1,114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. మొత్తం 292 మందికి అనుమతి దక్కింది. ఈ లిస్టులో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.

రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో కేవలం ఇద్దరే ఇద్దరు దేశీ ఆటగాళ్లకు చోటు లభించగా.. ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ఇందులో హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్‌ను చేర్చారు. అలాగే మరో ఎనిమిది విదేశీ క్రికెటర్లను సైతం రూ.2కోట్ల బేస్‌ప్రైస్‌ జాబితాలో చేర్చారు. ఇందులో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ ఉన్నారు.

ఇదిలా వుంటే.. రూ.1.5 బేస్‌ప్రైజ్‌ కేటగిరిలో 12 మందిని, రూ.కోటి కేటగిరిలో హనుమ విహారి, ఉమేశ్‌యాదవ్‌ సహా 11 మందిని చేర్చారు. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కులర్‌ తనయుడు అర్జున్‌కు సైతం వేలంలో చోటు కల్పించారు. ఈ మినీ వేలంలో పలు ఫ్రాంచైజీలు తన తుది జట్టు కూర్పుకు మెరుగులు దిద్దనుండగా.. మరికొన్ని భారీ మార్పులు చేయనున్నాయి. కాగా, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్, డేవిడ్ మాలన్‌లపై ఫ్రాంచైజీలు గురి సాధించినట్లు సమాచారం.

ఐపీఎల్ 2021 ఆక్షన్ వివరాలు(IPL 2021 Auction LIVE Streaming online, Time, Venue)..

  • వేదిక: హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళా, చెన్నై
  • సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
  • వీక్షించండి ఇలా: హాట్ స్టార్ యాప్, స్టార్ స్పోర్ట్స్ ఛానల్
  • ప్లేయర్స్ సంఖ్య: 292(164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు)
ఐపీఎల్ టీమ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ జాబితా మిగిలిన అమౌంట్ ఓవర్సీస్ స్లాట్స్
ముంబై ఇండియన్స్ మలింగా, కౌల్టర్‌నైల్, పాటిన్సన్, మెక్‌లేగ్హన్, షేన్ రూటర్‌ఫోర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్ బల్వంత్ రూ. 15.35 కోట్లు 4
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, మొయిన్ అలీ, స్టెయిన్, ఉదానా, శివమ్ దూబే, ఉమేష్ యాదవ్, పార్థివ్ పటేల్, పవన్ నేగి, గుర్కీరాట్ సింగ్ మనన్ రూ. 35.7 కోట్లు 4
ఢిల్లీ క్యాపిటల్స్ అలెక్స్ క్యారీ, కీమో పాల్, లమిచన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ శర్మ, సామ్స్, జాసన్ రాయ్ రూ. 12.8 కోట్లు 2
సన్‌ రైజర్స్ హైదరాబాద్ బిల్లీ స్టాంక్లేక్, ఫాబియన్ అలెన్, సందీప్ బావనక, సంజయ్ యాదవ్, పృథ్వీ రాజ్ రూ. 10.75 కోట్లు 1
రాజస్థాన్ రాయల్స్ స్టీవ్ స్మిత్, ఒషానే థామస్, టామ్ కుర్రాన్, వరుణ్ ఆరోన్, అంకిత్ రాజ్‌పుత్, అనిరుద్, ఆకాష్ సింగ్, శశాంక్ సింగ్ రూ. 34.85 కోట్లు 3
కోల్‌కతా నైట్ రైడర్స్ టామ్ బంటన్, క్రిస్ గ్రీన్, నిఖిల్ నైక్, సిద్దేశ్ లాడ్, ఎం. సిద్ధార్ద్ రూ. 10.85 కోట్లు 2
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాక్స్‌వెల్, విల్జోయిన్, కాట్రెల్, ముజీబ్, నీషమ్, కృష్ణప్ప గౌతమ్, కరుణ్ నాయర్, సుచిత్, తేజిందర్ రూ. 53.2 కోట్లు 5
చెన్నై సూపర్ కింగ్స్ షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా, మోను సింగ్ రూ. 22.9 కోట్లు 1

రిటైన్ ప్లేయర్స్ లిస్ట్: