IPL 2021 Auction Highest Paid Players: ఐపీఎల్ రికార్డులు తిరగరాసిన విదేశీ.. స్వదేశీ పోటుగాళ్లు వీరే..!

|

Feb 18, 2021 | 9:59 PM

IPL 2021 Auction Highest Paid Players: ఐపీఎల్ మినీ వేలం రసవత్తరంగా సాగింది. ఆటగాళ్లను కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈసారి వేలంలో కొన్ని నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొందరు ఊహించినట్లుగా భారీ

IPL 2021 Auction Highest Paid Players: ఐపీఎల్ రికార్డులు తిరగరాసిన విదేశీ.. స్వదేశీ పోటుగాళ్లు వీరే..!
IPL 2021 auction highest paid players
Follow us on

IPL 2021 Auction Highest Paid Players: ఐపీఎల్ మినీ వేలం రసవత్తరంగా సాగింది. ఆటగాళ్లను కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈసారి వేలంలో కొన్ని నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొందరు ఊహించినట్లుగా భారీ ధర పలకగా, మరికొందరు రికార్డు ధరతో షాకిచ్చారు. ఈసారి ఐపీఎల్‌ వేలం ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగింది. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు దృష్టిలో పెట్టుకోలేదు. ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా భారీ ధర పలికింది.

ఐపీఎల్‌ చరిత్రలో సరికొత్త రికార్డు “క్రిస్‌ మోరిస్”‌ 

దక్షిణాఫ్రికా పేస్ ఆల్​రౌండర్ క్రిస్‌ మోరిస్‌ ఐపీఎల్‌ రికార్డును తిరగరాశాడు. గత సీజన్‌లో ఇతడికి బెంగళూరు తరఫున కొన్ని మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. ఆ మ్యాచుల్లోనూ మోరిస్ అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు విజయాలందించాడు. మెరుపువేగంతో బంతులు వేసే మోరిస్‌ జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్స్‌మన్‌గా మారి భారీ సిక్సర్లు కూడా కొట్టగలిగే సత్తా ఉన్నోడు. గతేడాది బెంగళూరు మోరిస్‌ను వదులుకోవడం వల్ల ఈసారి వేలంలోకి వచ్చాడు. కాగా.. రూ.75లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన మోరిస్‌ను రాజస్థాన్‌ జట్టు ఏకంగా రూ.16.25కోట్లతో దక్కించుకుంది. మోరిస్‌ కోసం ముంబై, పంజాబ్‌, రాజస్థాన్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే.. రాయల్స్‌ ఎక్కడా వెనకడుగు వేయకపోవడం వల్ల మోరిస్‌పై ఆ జట్లు ఆశలు వదులుకోక తప్పలేదు.

అంతా షాక్.. పేసర్‌ కైల్‌ జేమిసన్

న్యూజిలాండ్‌ పేసర్‌ కైల్‌ జేమిసన్‌ని బెంగళూరు రూ.15కోట్లకు దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతను 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ జాతీయ జట్టులో చేరాడు. ఇప్పటివరకు 6 టెస్టుల్లో 36 వికెట్లు తీశాడు. వైట్‌బాల్‌తోనూ వికెట్లు తీయడంలో సత్తా ఉన్నోడు.

మ్యాక్స్​వెల్.. రియల్ జాక్‌పాట్‌ 

జాక్‌పాట్‌ కొట్టింది మాత్రం ఆస్ట్రేలియన్‌ పించ్‌ హిట్టర్ మ్యాక్స్​వెల్​. గత సీజన్‌లో ఒక్క సిక్సర్‌ కొట్టలేకపోయాడు. ఈసారి వేలంపాటలో ఏకంగా భారీ బౌండరీ బాదాడు. గతేడాది పంజాబ్‌ తరఫున ఆడిన మ్యాక్సీ కనీసం ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోయి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో పంజాబ్‌ యాజమాన్యం అతడిని వదులుకుంది. దీంతో మ్యాక్స్​వెల్​కు ఈసారి తక్కువ ధర పలకడం ఖాయమని చాలామంది భావించారు. కానీ.. ఈసారి మ్యాక్స్​వెల్ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన ఈ పోటీలో చివరికు బెంగళూరు పైచేయి సాధించింది. ఏకంగా రూ.14.25కోట్లు పెట్టి బెంగళూరు మ్యాక్స్​వెల్​ను సొంతం చేసుకుంది.

మెరిసిన రిచర్డ్‌సన్..

మరో ఆస్ట్రేలియన్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ మెరిశాడు. పంజాబ్‌ జట్టు ఏకంగా రూ.14కోట్లు పెట్టి ఈ యువ స్పీడ్‌గన్‌ను సొంతం చేసుకుంది. రిచర్డ్‌సన్‌ను దక్కించుకోవడానికి ఢిల్లీ, బెంగళూరు, ముంబై  ఇండియన్స్ చివరివరకూ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియన్‌ టీ20 స్పెషలిస్టు మ్యాక్స్​వెల్​ను వదులుకున్న పంజాబ్‌ ఆ స్థానంలో రిచర్డ్‌సన్‌ను కొనుగోలు చేసింది.

ఏందప్ప.. కృష్ణప్ప 

2019లో రాజస్థాన్‌ తరఫున ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కర్ణాటక స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. గతేడాది పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో ఆ జట్టు కృష్ణప్పను వదులుకుంది. తాజాగా.. జరిగిన వేలంలో అతడికి ఊహించని విధంగా ధర దక్కింది. చెన్నై జట్టు ఏకంగా రూ.9.25 కోట్లు కృష్ణప్పను దక్కించుకుంది. రూ.20లక్షల కనీస ధరతో అతను వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా.. టీమిండియా జట్టులో ఆడకుండానే ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా కృష్ణప్ప గౌతమ్‌ రికార్డు సృష్ష్టించాడు. గతంలో కృనాల్ పాండ్యాను రూ.8.8 కోట్లకు ముంబై దక్కించుకుంది.

అన్​క్యాప్​డ్ విదేశీ ఆటగాడు మెరెడిత్‌‌ రికార్డు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మ్యాక్స్​వెల్​ను వదులుకున్న పంజాబ్‌ జట్టు మళ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. యువ పేసర్‌ మెరెడిత్‌ను ఏకంగా రూ.8కోట్లు పెట్టి దక్కించుకుంది. అతడి కోసం ఢిల్లీ, పంజాబ్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ఢిల్లీ వెనక్కి తగ్గింది. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ విదేశీ క్రికెటర్​కు ఇంత ధర దక్కడం ఇదే తొలిసారి. ఇంతకుముందు జోఫ్రా ఆర్చర్​ 7.2 కోట్లకు అమ్ముడయ్యాడు.

సూపర్ షారుఖ్ ఖాన్‌

తమిళనాడుకు చెందిన యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్ ఖాన్‌ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎంట్రీలోనే అతడు కోట్లు కొట్టేశాడు. రూ.20లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన షారుక్​ను పంజాబ్‌ జట్టు ఏకంగా రూ.5.25కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అతడు అండర్‌19 ప్రపంచకప్‌, సయ్యద్‌ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో మెరుపులు మెరిపించి అందరి దృష్టి అకర్షించాడు.

ఇవి కూడా చదవండి : 

IPL 2021 Auction : రసవత్తరంగా ఐపీఎల్ మినీ వేలం.. అర్జున్ టెండూల్కర్‌ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్

Jhye Richardson: ఓ మై గాడ్.. ఇంత భారీ ధరా..! రిచర్డ్​సన్​ను దక్కించుకున్న పంజాబ్.. మరికొందరి వివరాలు