IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ శరవేగంగా సాగుతోంది. చెన్నై వేదికగా సాగుతున్న ఈ వేలం పాటలో తొలి ప్లేయర్‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. గత కొన్ని సీజన్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ. 2.20 కోట్లకు కొనుగోలు చేసింది. మొదటిగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ స్టీవ్ స్మిత్‌పై దృష్టి సారించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం పాటలో రూ. 2.20 కోట్లకు దక్కించుకుంది. దీనితో ఈ ఏడాది వేలం పాటలో మొదటిగా అమ్ముడైన ప్లేయర్ స్టీవ్ స్మిత్ కావడం విశేషం. అటు ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫస్ట్ సెట్‌లో అమ్ముడుపోకపోవడం గమనార్హం.
కాగా, ఈ ఏడాది జరుగుతోన్న మినీ వేలం పాటలో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో కేవలం ఇద్దరే ఇద్దరు దేశీ ఆటగాళ్లకు చోటు లభించగా.. ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.