IPL 2021 Auction: మినీ ఆక్షన్ రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే చెన్నై వేదికగా జరగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు ఈ ఆక్షన్ లో పాల్గొననున్నారు. ఈ లిస్టులో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ వేలం ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ తో ప్రారంభం కానుంది.
ఫించ్ బేస్ ప్రైజ్ రూ. కోటి కాగా.. గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆర్సీబీ రూ. 4 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే ఫామ్ లేమితో ఫించ్ సతమతమవుతుండటంతో ఈ ఏడాది ఎవరు కొనుగోలు చేస్తారో వేచి చూడాలి. కాగా, ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.