Arjun Tendulkar: తండ్రి తర్వాత కొడుకు.. ముంబై జట్టులోకి అర్జున్ టెండూల్కర్.. ధర ఎంతో తెలుసా.?

|

Feb 18, 2021 | 8:51 PM

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ మొదటిసారిగా ఐపీఎల్ ఆక్షన్‌లో పాల్గొనగా.. అనుకున్నట్లుగానే ముంభై ఇండియన్స్...

Arjun Tendulkar: తండ్రి తర్వాత కొడుకు.. ముంబై జట్టులోకి అర్జున్ టెండూల్కర్.. ధర ఎంతో తెలుసా.?
Follow us on

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ ముగిసింది. కొన్ని ఆశ్చర్యాలు.. మరికొన్ని సంచలనాల నడుమ పూర్తయింది. ఎక్కువగా యువ కెరటాలు, ఆల్‌రౌండర్లు, స్టార్ ప్లేయర్స్‌పై దృష్టి సారించిన ఫ్రాంచైజీలు.. వెటరన్ ఆటగాళ్లను ఎంపిక చేసుకోలేదు.

ఇదిలా ఉంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ మొదటిసారిగా ఐపీఎల్ ఆక్షన్‌లో పాల్గొనగా.. అనుకున్నట్లుగానే ముంభై ఇండియన్స్ బేస్ ప్రైస్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. దేశీయ అన్‌క్యాప్ద్ ఆటగాళ్ల జాబితాలో అర్జున్ కోసం ముంబై మాత్రమే బిడ్ వేసింది. మిగిలిన ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. వేలానికి ముందు కళ్లన్నీ అర్జున్ టెండూల్కర్‌పైనే ఉన్న సంగతి తెలిసిందే. ఎంసీజీ తరపున ఓ టోర్నమెంట్‌లో ఆల్‌రౌండ్ షో చూపించడంతో భారీ మొత్తం పలుకుతాడని భావించారు. అయితే చివరి రూ. 20 లక్షలకే అమ్ముడయ్యాడు.