Harleen Deol: ఒక్క క్యాచ్‌తో రాత్రికి రాత్రే బాగా ఫేమస్ అయిన టీమిండియా మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్.. ప్రస్తుతం సోషల్ మీడియా సంచలనంగా మారింది. ఈ బౌలర్ పై ప్రముఖులతో పాటు సోషల్ మీడియా యూజర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా హర్లీన్ డియోల్ క్యాచ్ కు ఫిదా అయ్యారు. ఈమేరకు ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అందుకున్న క్యాచ్ అసాధారణం.. మున్ముందు ఇలాగే నీఆటతో ఆకట్టుకోవాలని కోరుతూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట చేశారు. మైగవ్ ఇండియా పంచుకున్న వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు మోడీ. ‘అసాధారణం.. వెల్ డన్ హర్లీన్ డియోల్’ అంటూ క్యాప్షన్ అందించారు.
టీమిండియా మహిళా క్రికెటర్లు.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు టీ20లో సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టీ20లు పూర్తయ్యాయి. ఇందులో భారత్, ఇంగ్లండ్ టీంలు తలో విజయంతో సిరీస్ ను 1-1తో సమానంగా నిలిచాయి. అయితే తొలి టీ20 సందర్భంగా నార్తంప్టన్ లో జరిగిన మ్యాచ్ లో తొలుత ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. అమీ జోన్స్ దూకుడుగా ఆడుతోంది. బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ దక్కడం లేదు. 43 పరుగుల వద్ద శిఖా ఫాండే వేసిన 18 వ ఓవర్లో వేసిన ఓ బంతిని భారీ షాట్ ఆడింది. బౌండరీ వద్ద ఉన్న హర్లీన్ డియోల్.. అద్భుతంగా మూవ్ అయింది. చాలా ఎత్తులో వచ్చిన క్యాచ్ ను అందుకునేందుకు గాల్లోకి ఎగిరింది. బాల్ ను అందుకున్న డియోల్.. బౌండరీ అవతలకు వెళ్లకముందే స్పందించి బాల్ ను గాల్లోకి విసిరి, వెంటనే బౌండరీ లోపలకు చేరి మరలా క్యాచ్ ను అందుకుంది. దాంతో జోన్స్ కథ ముగిసింది. ఇక అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హర్లీన్ డియోల్ యాక్షన్ కు అంతా ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. క్రికెటర్లు, ఫ్యాన్స్, సెలబ్రెటీలు డియోల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే మోదీ కూడా ఇన్ స్టా స్టోరీస్ లో వీడియోను షేర్ చేసి, ప్రశంసించారు.
A fantastic piece of fielding ?
We finish our innings on 177/7
Scorecard & Videos: https://t.co/oG3JwmemFp#ENGvIND pic.twitter.com/62hFjTsULJ
— England Cricket (@englandcricket) July 9, 2021
Also Read: