
South Africa vs india: భారత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. దీంతో ఆ జట్టు భారత గడ్డపై 25 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బావుమా హాన్సీ క్రోంజే సరసన చేరాడు. హాన్సీ క్రోన్జే నేతృత్వంలోని సౌతాఫ్రికా 2000లో టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు టెంబా బావుమా ఆధ్వరంలోని జట్టు 25 ఏళ్లకు మళ్లీ టీమిండియాపై గెలిచి రికార్డు సృష్టించింది.
అయితే ఈ పరాజయంతో భారత్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా టెస్టు చరిత్రలో స్వదేశంలో అతిపెద్ద ఓటమిగా ఇది నిలిచింది. గతంలో 1996లో దక్షిణాఫ్రికాతో కోల్‌కత్తాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 329 పరుగులు, 2017లో పూణేలో ఆస్ట్రేలియాతో 333, 2007లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో 337, 2006లో కరాచీలో పాకిస్తాన్‌తో 341, 2004లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో 342 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయలను మూటకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 408 పరుగుల భారీ తేడాతో పరాజయం చెంది అత్యత చెత్త రికార్డును మూటకట్టుకుంది.
టీమిండియాపై భారీ విజయంతో దక్షిణాఫ్రికా రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికా 2018లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాతో 492 పరుగులతో గెలుపొందింది. ఆ తర్వాత ఇది ఆ జట్టుకు రెండో అతిపెద్ద టెస్ట్ విజయంగా చెప్పవచ్చు.
ఇక వరుసగా స్వదేశీ టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమి చెందటం భారత్‌కు ఇది రెండోసారి. గత సంవత్సరం న్యూజిలాండ్ 0-3 వైట్ వాష్‌తో భారత్‌ను ఓడించగా.. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో పరాజయం పాలైంది. గతంలో 1983లో స్వదేశంలో వెస్టిండీస్, 1984లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ను భారత్ వరుసగా కోల్పోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..