India’s Tour of South Africa: ప్రమాదంలో దక్షిణాఫ్రికా పర్యటన.. దడ పుట్టిస్తోన్న కొత్త వేరియంట్.. ఇండియా ఏ మ్యాచులపైనా నెలకొన్న సందిగ్ధత?

|

Nov 27, 2021 | 6:59 AM

IND vs SA: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో టీమిండియా అక్కడ పర్యనపైనా ఈ కొత్త వేరియంట్ ప్రభావం పడనుంది.

Indias Tour of South Africa: ప్రమాదంలో దక్షిణాఫ్రికా పర్యటన.. దడ పుట్టిస్తోన్న కొత్త వేరియంట్.. ఇండియా ఏ మ్యాచులపైనా నెలకొన్న సందిగ్ధత?
India's Tour Of South Africa
Follow us on

India vs South Africa: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో టీమిండియా అక్కడ పర్యనపైనా ఈ కొత్త వేరియంట్ ప్రభావం పడనుంది. దీంతో ఈ సిరీస్‌ జరడగంపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అక్కడ పర్యటిస్తున్న ఇండియా ఏ మ్యాచులపైనా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానాలో 50 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి భారతదేశంలో ఎటువంటి కేసు వెలుగుచూడలేదు. వీటన్నింటి మధ్య వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనపై బీసీసీఐ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 17 నుంచి జనవరి 26 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, ప్రాల్, కేప్ టౌన్, సెంచూరియన్‌లలో మొత్తం 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. 3 టెస్ట్ మ్యాచ్‌లు, 3 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ, కొత్త వేరియంట్ నుంచి ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదల కారణంగా ఆఫ్రికాలో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే టీమిండియా ఏ జట్టు దక్షిణాఫ్రికాలో సిరీస్ ఆడుతోన్న విషయం తెలిసిందే.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య 10 మ్యాచ్‌లు, ప్రాల్‌‌లో 3, జోహన్నెస్‌బర్గ్, సెంచూరియన్‌లలో ఒక్కో మ్యాచ్‌, కేప్‌టౌన్‌లో 5 మ్యాచులు ఆడాల్సి ఉంది. జోహన్నెస్‌బర్గ్, సెంచూరియన్ నగరాలు గోటెంగ్ ప్రావిన్స్ కిందకు వస్తాయి. గోటెంగ్ ప్రస్తుతం కొత్త వేరియంట్‌తో తెగ ఇబ్బంది పడుతోంది. ఇక్కడ అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

కేప్ టౌన్, పార్ల్ నగరాలు పశ్చిమ కేప్ ప్రావిన్స్‌లో భాగంగా ఉన్నాయి. కొత్త వేరియంట్ ఫోకస్ ప్రాంతాలలో వెస్ట్రన్ కేప్ కూడా ఉంది. ఇవి కాకుండా క్వాజులు నాటల్, తూర్పు కేప్‌లో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిరీస్‌‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

మ్యుటేషన్ వైరస్‌ను ప్రమాదకరమైన కొత్త వేరియంట్‌గా మారింది. B.1.1.529 బోట్స్వానాలో కూడా వెలుగుచూసింది. బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఈ రూపాంతరంపై ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఇందులో 32 ఉత్పరివర్తనలు ఉన్నాయని, దీని కారణంగా వ్యాక్సిన్ కూడా దీనికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉండదని, ఈ రూపాంతరం దాని స్పైక్ ప్రోటీన్‌ను సవరించడం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఈమేరకు దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఓ ప్రకటనను జారీ చేసింది. ఇప్పటివరకు దేశంలో ఈ వేరియంట్‌కు సంబంధించిన 22 కేసులు వెలుగుచూశాయి. శాస్త్రవేత్తలు B.1.1.529పై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీనిపై WHO కరోనా కేసు టెక్నికల్ హెడ్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ – ఈ వేరియంట్ గురించి మాకు పెద్దగా సమాచారం అందలేదు. బహుళ ఉత్పరివర్తనాల కారణంగా, వైరస్ ప్రవర్తన మారుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయమని తేల్చి చెప్పారు.

భారతదేశంలో..
భారతదేశంలో ఇప్పటివరకు కొత్త వేరియంట్ కేసు ఏదీ వెలుగుచూడలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లల్లో కూడా బి.1.1.529 శాంపిల్ వెలుగుచూడలేదని పేర్కొంది. కొత్త వేరియంట్ భారత్‌లో కనిపించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది భారత్‌కు ఊరటనిచ్చే వార్తే అయినా.. చాలా జాగ్రత్తగా ఉండాలని కోరింది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ హాంకాంగ్‌కు చేరడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఈ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని, హాంకాంగ్, బోట్స్వానా నుండి వచ్చే ప్రయాణికులను పరీక్షించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిఘా తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా నుంచి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షించాలని కూడా కోరినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఎయిమ్స్‌లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ సంజయ్ రాయ్ మాట్లాడుతూ, కొత్త వేరియంట్‌ను అర్థం చేసుకోవడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని, ఇది కొత్త వేరియంట్ అని, ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో ఇప్పుడు మనకు తెలియదు. మేం దీనిపై క్షుణ్ణంగా పరిశీలను చేస్తున్నాం. టీకాలు వేసిన వారిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అలా అయితే, అది తీవ్రమైన సమస్యగా మారనుందని ఆయన పేర్కొన్నారు. దీంతో రాబోయే వేరియంట్ మరింత ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది.

Also Read: పెను విధ్వంసం ఈ బ్యాట్స్‌మెన్‌.. 7 బంతుల్లో 6 సిక్సర్లు.. 22 బంతుల్లో 48 పరుగులు..

క్యాచ్‌ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన రవీంద్ర జడేజా.. అతడు వచ్చి మెడ పట్టుకున్నాడు.. గ్రౌండ్‌లో గొడవ..