Team India: కెప్టెన్‌గా రోహిత్.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ స్క్వాడ్ ఇదే.! లిస్టులో తెలుగబ్బాయ్

|

Jan 08, 2025 | 7:01 PM

మరికొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది. జనవరి 11న బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనుండగా.. జస్ప్రిత్ బుమ్రా గాయం కారణం దూరం కానున్నాడని తెలుస్తోంది. మరి స్క్వాడ్ ఏంటో ఓసారి చూసేద్దామా..

Team India: కెప్టెన్‌గా రోహిత్.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ స్క్వాడ్ ఇదే.! లిస్టులో తెలుగబ్బాయ్
Team India
Follow us on

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 3-1తో టీమిండియా ఘోర పరాజయాన్ని చవి చూసింది. బుమ్రా మినహా సీనియర్లందరూ పేలవ ప్రదర్శన కనబరచడంతో అటు బీజీటీ ట్రోఫీ మాత్రమే కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు కూడా నీరుగారాయ్. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండటంతో భారత్ జట్టుపై ఇది తీవ్ర ప్రభావం చూపించిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య హోం సిరీస్ జరగనుంది. ఇందులో ఇరు జట్లు 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

ఈ నేపధ్యంలో జనవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాలు తమ జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. జనవరి 11న తుది జట్టును ప్రకటించేందుకు అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్‌కు రోహిత్ శర్మ కూడా పాల్గొంటాడు. ఇది అటుంచితే విరాట్, రోహిత్ ఇంగ్లాండ్‌తో వన్డేలు ఆడి.. తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మ సారధ్యం వహించడం దాదాపుగా ఖాయమైనట్టుగా కనిపిస్తోంది. ఇక ప్రాబబుల్స్‌లో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డికి మొండిచెయ్యి చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టులో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్లు ఉండటంతో.. వీరి ఎంపిక ఇక కష్టమేగా అనిపిస్తోంది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్‌తో దుమ్ములేపిన జైస్వాల్ తిరిగి జట్టులోకి రానుండగా.. బుమ్రా అందుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. అటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్‌లకు ప్రాబబుల్స్‌‌లో చోటు దక్కే అవకాశం ఉందట. ఇక డొమెస్టిక్ క్రికెట్‌లో బ్యాటింగ్‌తో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులో రానున్నట్టు తెలుస్తోంది.

ప్రాబబుల్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా(గాయంపై క్లారిటీ రావాల్సి ఉంది), మహమ్మద్ షమీ/ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్/తిలక్ వర్మ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి