IND vs PAK T20, Commonwealth Games 2022: కామన్వెవెల్త్ గేమ్స్ జులై 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. ఆదివారం అర్థరాత్రి బయల్దేరిన టీమిండియా సోమవారం రాత్రికి ఆలస్యంగా చేరుకుంది. కామన్వెల్త్‌లోనే టీమిండియా పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. క్రికెట్ జట్టుతో పాటు అథ్లెటిక్స్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ సహా ఇతర జట్లు కూడా ఇంగ్లండ్ చేరుకున్నాయి. 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. గతంలో అంటే 1998లో కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఉండేంది. ఈసారి మహిళల క్రికెట్‌కు మాత్రమే అవకాశం లభించింది. ఇది మొదటిసారి. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 72 దేశాల నుంచి 4,500 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు.
ఆగస్టు 7న పతకాల కోసం పోటీలు..
కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టోర్నమెంట్‌లో క్రికెట్ గేమ్‌ల మొదటి మ్యాచ్ జులై 29న జరగనుంది. అన్ని మ్యాచ్‌లు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతాయి. ఆగస్టు 7న క్రికెట్‌కు సంబంధించి బంగారు, కాంస్య పతకాల మ్యాచ్‌లు జరుగుతాయి.
8 మహిళల జట్లు, రెండు గ్రూపులు..
ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో 8 మహిళా క్రికెట్ జట్లను చేర్చారు. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ 2 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం ఇరు జట్ల మధ్య ఫైనల్‌లో స్వర్ణ పతక పోరు జరగనుంది.
గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్
గ్రూప్ B: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక
తేదీ | మ్యాచ్ | సమయం | వేదిక |
జులై 29, 2022 | ఆస్ట్రేలియా vs భారత్ | 3:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
జులై 29, 2022 | పాకిస్థాన్ vs బార్బడోస్ | 10:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
జులై 31, 2022 | భారత్ vs పాకిస్థాన్ | 3:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
జులై 31, 2022 | బార్బడోస్ vs ఆస్ట్రేలియా | 10:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 3, 2022 | ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ | 3:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 3, 2022 | ఇండియా vs బార్బడోస్ | 10:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
తేదీ | మ్యాచ్ | సమయం | వేదిక |
జులై 30, 2022 | న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా | 3:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
జులై 30, 2022 | ఇంగ్లండ్ vs శ్రీలంక | 10:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 2, 2022 | ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా | 3:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 2, 2022 | శ్రీలంక vs న్యూజిలాండ్ | 10:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 4, 2022 | దక్షిణాఫ్రికా vs శ్రీలంక | 3:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 4, 2022 | ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ | 10:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
తేదీ | మ్యాచ్ | సమయం | వేదిక |
ఆగస్టు 6, 2022 | 1వ సెమీ ఫైనల్ | 3:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 6, 2022 | 2వ సెమీఫైనల్ | 10:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 7, 2022 | కాంస్య పతక పోరు | 2:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
ఆగస్టు 7, 2022 | చివరి | 9:30 PM | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
కామన్వెల్త్ కోసం భారత మహిళల జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, ఎస్. మేఘన, తానియా భాటియా (కీపర్), యాస్తికా భాటియా (కీపర్), దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా.
#CommonwealthGames2022 | #Indian Women Cricket team, Athletics team, Squash team, and
Table Tennis team arrives at Birmingham Airport, #England. pic.twitter.com/7jnpGB78BS— DD News (@DDNewslive) July 25, 2022
స్టాండ్‌బై: రిచా ఘోష్, పూనమ్ యాదవ్, సిమ్రాన్ దిల్ బహదూర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..