Vaibhav Suryavanshi : ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత..పాకిస్తాన్ స్టార్ కంటే మనోడే నంబర్-1

ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ షాహీన్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏ జట్టును ఓడించి పాకిస్తాన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. వారిలో ఓపెనర్ మాజ్ సదాకత్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Vaibhav Suryavanshi : ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత..పాకిస్తాన్ స్టార్ కంటే మనోడే నంబర్-1
Vaibhav Suryavanshi

Updated on: Nov 24, 2025 | 11:24 AM

Vaibhav Suryavanshi : ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ షాహీన్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏ జట్టును ఓడించి పాకిస్తాన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. వారిలో ఓపెనర్ మాజ్ సదాకత్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఒక ప్రత్యేకమైన విభాగంలో మాత్రం మాజ్ సదాకత్.. భారత్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశి కంటే వెనుకబడిపోయాడు.

పాకిస్తాన్‌కు చెందిన ఓపెనర్ మాజ్ సదాకత్ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను కేవలం 5 మ్యాచ్‌లలో 129 సగటుతో 258 పరుగులు చేసి పాకిస్తాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అత్యధిక సిక్సర్లు కొట్టిన విషయంలో అందరి చూపు భారత్‌కు చెందిన 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశిపై పడింది. మాజ్ సదాకత్ 5 మ్యాచ్‌లలో 19 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు. కానీ, వైభవ్ సూర్యవంశి ఒక మ్యాచ్ తక్కువ ఆడి (4 మ్యాచ్‌లలో) ఏకంగా 22 ఆకాశాన్ని అంటే సిక్సర్లు కొట్టి ఈ విషయంలో నంబర్-1 స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన హబీబూర్ రెహమాన్ 21 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఈ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో ఇండియా ఏ జట్టు సెమీఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ, వైభవ్ సూర్యవంశి తనదైన ముద్ర వేశాడు. టోర్నమెంట్‌లో అతను కేవలం 4 ఇన్నింగ్స్‌లలో 239 పరుగులు చేశాడు. వైభవ్ ఈ పరుగులను 243.87 అనే భారీ స్ట్రైక్ రేట్‌తో సాధించడం విశేషం. అంతేకాదు టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా వైభవ్ పేరిటే ఉంది. యూఏఈ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 42 బంతుల్లో 144 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రదర్శన అతన్ని భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఒక పవర్ఫుల్ ఆటగాడిగా నిలుస్తుందని నిరూపించింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..