Ravichandran Ashwin: ఇండియన్ క్రికెటర్స్ ప్రస్తుతం హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత ఇంగ్లాడ్‌కే పరిమితమయ్యారు టీమిండియా ప్లేయర్స్. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇండియన్ ప్లేయర్స్ భారత్‌కు తిరిగిరాలేదు. ఇదిలా ఉంటే ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభంకావడానికి ఇంకా సమయం ఉండడంతో క్రికెటర్లకు బీసీసీఐ విరామం ప్రకటించింది. దీంతో ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటికే విరాట్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, రహానె రోహిత్ శర్మ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
ఇక తాజాగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన భార్య పిల్లలతో ఇంగ్లాండ్‌లో జాలీగా గడుపుతున్నాడు. ఈ సమయంలోనే తీసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు అశ్విన్. సముద్ర తీరాన ఉన్న ఓ గోడపై నడుస్తూ సముద్రంవైపు అడుగులు వేస్తున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన అశ్విన్.. ‘సముద్రం ఆకాశంతో కలుస్తున్న వేళ’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించాడు. ఇక అశ్విన్ ఈ వీడియోకు తమిళ సూపర్ హిట్ చిత్రం ’96’ (తెలుగులో జాను)లోని ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అనే పాటను జోడించాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Indian Female Swimmers: అంతర్జాతీయ స్థాయిలో రాణించిన మహిళా స్విమ్మర్లు..!
Tokyo Olympics 2021: జపాన్‌లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఒలంపిక్స్ నిర్వాహకుల్లో ఆందోళన